Deepika Pilli : నేను నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఇదే.. దీపిక పిల్లి షాకింగ్ పోస్ట్ వైరల్!

ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో సెలబ్రెటీలు పెట్టే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.చాలావరకు వాళ్ళు పెట్టే పోస్టులు తమకు సంబంధించిన విధంగానే ఉంటాయి.

 Deepika Pilli Shared Biggest Lesson Learned In Life Post Viral,deepika Pilli,dhe-TeluguStop.com

ఒక్కొక్కసారి వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను కూడా పెడుతూ అందరి దృష్టిలో పడుతూ ఉంటారు.అంటే వారికి ఏమైనా జరిగిందా అన్నట్లుగా ఆ పోస్టులు ఉంటాయి.

అయితే తాజాగా ఓ సెలబ్రిటీ పెట్టిన పోస్ట్ కూడా అలాగే మారింది.ఇంతకు ఆమె ఎవరో కాదు సోషల్ మీడియా స్టార్, యాంకర్, నటి దీపిక పిల్లి.

ఈమధ్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అవుతున్నారు.తమ సొంత టాలెంట్ లతో డాన్సులను చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అడుగుపెడుతున్నారు.

ఇక అందులో దీపిక పిల్లి ఒకరు.అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ సోషల్ మీడియా స్టార్ గానే కాకుండా యాంకర్ గా, నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

టిక్ టాక్ వీడియోలలో పొట్టి పొట్టి డ్రెస్సులతో, అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న స్టార్ దీపిక పిల్లి.తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

నిత్యం ఏదో ఒక వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉంటాయి.

కొత్తగా విడుదలైన పాటలకు స్టెప్పులు వేస్తూ వెంటనే నెట్టింట్లో పెట్టి కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది.తన అందంతో రచ్చ చేస్తుంది.

అలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ గా మారినందుక టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి.మొదట్లో బుల్లితెరపై పలు షో లో గెస్ట్ గా పాల్గొంది.

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో లో యాంకర్ రష్మీ తో తను కూడా టీం లీడర్ గా పనిచేసింది.

Telugu Biggest Lesson, Deepika Pilli, Dhee Show, Quotes, Shekar Master-Movie

ఇక అందులో తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది.ఈ షో తర్వాత ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకాలో ఏకంగా యాంకర్ గా అవకాశం అందుకుంది.ఇందులో శేఖర్ మాస్టర్ తో కలిసి తను చేసే డాన్స్ స్టెప్పులు చూస్తే మాత్రం ఫిదా కావాల్సిందే.

ఇక ఇటీవలే సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్గా కూడా నటించింది.అలా అతి తక్కువ సమయంలో హీరోయిన్గా కూడా అడుగుపెట్టేసింది.

Telugu Biggest Lesson, Deepika Pilli, Dhee Show, Quotes, Shekar Master-Movie

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ పంచుకుంటూనే ఉంటుంది.అయితే తాజాగా తను ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకుంది.ఇంతకు అందులో ఏముందంటే.అందులో తను ఈ సంవత్సరం నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఇదే అంటూ.మనకు ఎక్కువ ప్రేమ చూపిన వాళ్లకు మనం అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు అంటూ.అదే తను నేర్చుకున్న గుణపాఠం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

ఇక ఈమె షేర్ చేసుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.దీంతో ఆమెకు ఏం జరిగింది అంటూ కొందరు అనుమానం పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube