ప్రభాస్ కోసం చిందులేస్తున్న బ్యూటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Deepika Padukone To Play Professional Dancer In Prabhas 21, Prabhas 21, Nag Ashw-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను ఓకే చేసిన ప్రభాస్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పచ్చజెండా ఊపాడు.కాగా పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందా అని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో దీపికా ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో దీపికా పాత్ర చాలా కీలకం కానుందని, ఆమె పాత్రతో వచ్చే ట్విస్టులు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న సూపర్ హీరో మూవీలో దీపికా పాత్ర చాలా కీలకం కానుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలో నటీనటులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనిదత్ ప్రొడ్యూస్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube