ద్రౌపదిగా దీపికా పదుకునే.. పాన్ ఇండియా రేంజ్ సినిమా

ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఓ వైపు బయోపిక్ లు మరో వైపు పీరియాడికల్, హిస్టారికల్, మైథలాజికల్ కథల ప్రహసనం నడుస్తుంది.మొన్నటి వరకు ఇండియన్ సినిమా అంటే ప్రాంతీయ భాషలు, హిందీ అనే వ్యత్యాసం ఉండేది.

 Deepika Padukone To Play Draupadi, Bollywood, Tollywood, Indian Cinema, Pan Ind-TeluguStop.com

అలాగే హిందీ హీరోలకి సౌత్ లో అంతగా డిమాండ్ ఉండేది కాదు.అలాగే సౌత్ హీరోలకి బాలీవుడ్, నార్త్ ఇండియాలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు.

కానీ ఇప్పుడు అలాంటి హద్దులు అన్ని చెరిగిపోయాయి.దానికి బీజం వేసింది రాజమౌళి బాహుబలి సినిమా.

పాన్ ఇండియా రేంజ్ లో సుమారు ఏడు బాషలలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ జానపద చిత్రానికి దేశం మొత్తం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.

ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది.అయితే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అంటే దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకి కనెక్ట్ అయ్యే స్టోరీలు అయ్యి ఉండాలి.

ఇప్పుడు అలాంటి స్టోరీలు అంటే ఒక మాఫియా బ్యాక్ డ్రాప్, సూపర్ హీరో రేంజ్ సినిమాలు, రెండు పీరియాడికల్, మైథలాజికల్ కథలతోనే సాధ్యం.

ఇండియన్ మైథాలజీలో చాలా ఉప కథలు ఉన్నాయి.

అలాగే హిస్టారికల్ పీరియాడికల్ కథలు కూడా ఉన్నాయి.రాజుల సాహసాలు గురించి చెప్పే కథలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు అందరూ పాన్ ఇండియా సినిమాల కోసం ఈ కథల మీద పడ్డారు.ఈ నేపధ్యంలో మైథలాజికల్ కథలకి బాగా డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం మహా భారతం ఆధారంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అరడజను సినిమాలు తయారవుతున్నాయి.వీటిలో దేనికదే ప్రత్యేకం అని చెప్పాలి.

ఈ నేపధ్యంలో దీపికా పదుకునే ద్రౌపదిగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతుంది. ద్రౌపదీ పాయింట్ అఫ్ వ్యూ నుంచి మహాభారతం కథని తెరపై రెండు భాగాలుగా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.

మధు మంతెన, దీపికా పదుకునే సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది.

వచ్చే ఏడాది దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube