నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్‌కు సరిసమానంగా దీపికా?  

Deepika Padukone To Have Equal Importance As Prabhas, Deepika Padukone, Prabhas, Nag Ashwin, Tollywood News - Telugu Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తిగాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు.

TeluguStop.com - Deepika Padukone To Have Equal Importance As Prabhas

కాగా ఈ క్రమంలో మహానటి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుంది.దీంతో ఈ సినిమాలో ప్రభాస్-దీపికా కాంబో ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందా అనే సందేహం అందరిలో మొదలైంది.

TeluguStop.com - నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్‌కు సరిసమానంగా దీపికా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో హీరో పాత్రకు సరిసమానంగా దీపికా పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.సూపర్ హీరో పాత్రకు ఉన్న ప్రాధాన్యత హీరోయిన్ పాత్రకు కూడా ఉంటుందనడంతో ఈ సినిమాలో దీపికా పాత్ర సమ్‌థింగ్ స్పెషల్ కానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరి ప్రభాస్‌ను సూపర్ హీరోగా మార్చే ఈ సినిమాలో దీపికా పదుకొనే పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అటు దీపికా ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌లోనూ నెలకొంది.ఇక స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వినిదత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.రాధేశ్యామ్ చిత్రం పూర్తయిన వెంటనే ప్రబాస్ ఈ సినిమాను ప్రారంభించాలని చూస్తున్నాడట.

కానీ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఓకే చేయడంతో ఇప్పుడు నాగ్ అశ్విన్ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.

#Prabhas #Nag Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Deepika Padukone To Have Equal Importance As Prabhas Related Telugu News,Photos/Pics,Images..