రణవీర్ ని పెళ్లి చేసుకోవడం వెనుక కారణం ఏంటో చెప్పేసిన దీపిక!

బాలీవుడ్ స్టార్ కపుల్ జంటలలో దీపికా పదుకొనే, రణవీర్ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పవచ్చు.ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట చాలా కాలం నుంచి ప్రేమించుకొని ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

 Ranveer Singh, Deepika Padukone, Shocking Comments, ,marrige-TeluguStop.com

అసలు దీపికా పదుకొనే రణవీర్ తో ప్రేమ ఎలా మొదలైంది? తనను ఎందుకు పెళ్లి చేసుకుంది అనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఆ ఇంటర్వ్యూలో దీపిక రణవీర్ గురించి ఎలాంటి ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Marrige, Ranveer Singh-Movie

దీపిక రణవీర్ ప్రేమ ప్రయాణం సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన రామ్ లీలా సినిమా కంటే ముందుగానే రణవీర్ ను ఇష్టపడ్డాను.అయితే రామ్ లీలా షూటింగ్ జరుగుతున్న సమయంలో మా ఇద్దరి మధ్య ఈ బంధం మరింత గట్టి పడిందని తెలియజేశారు.ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రణవీర్ ను దగ్గరగా చూడటంతో ఆ సమయంలోనే రణవీర్ నాకు సరైన జోడీ అనిపించిందనీ ఈ సందర్భంగా దీపిక తెలియజేశారు.

ఇక రణవీర్ ను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే రణవీర్ విషయంలో నేను ఎమోషనల్గా లొంగిపోయాను.

నాకు ఏ సమస్య వచ్చినా రణవీర్ ముందుండి నన్నునడిపించాడు.నాకు ఎంతో మానసిక ధైర్యం నింపేవాడనీ ఈ సందర్భంగా దీపిక తెలియజేశారు.ఏడు సంవత్సరాల ముందు అతని కన్నా సక్సెస్ లో ఉన్న నన్ను, నా సంపాదనను గౌరవించేవారు.ఆ విధంగా అతని ఎమోషన్ కి లొంగిపోయే పెళ్లి చేసుకోవడానికి కారణం అయ్యింది.

కానీ ప్రస్తుతం రణవీర్ నా కన్నా మంచి సక్సెస్ లో ఉంటూ అధికంగా సంపాదిస్తున్నాడు.కానీ మా ప్రేమ ముందు ఇలాంటివి చర్చకు రావు.

నా లైఫ్ లో ది బెస్ట్ సెలెక్షన్ అంటే రణవీర్ ను పెళ్లి చేసుకోవడం అని ఈ సందర్భంగా దీపిక తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube