జీవితం అంటే ఇదే.. దీపికా పదుకొనే కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటీమణులు సొట్ట బుగ్గల చిన్నది దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనే జనవరి 5వ తేదీన  తన పుట్టినరోజును జరుపుకోవడంతో పుట్టినరోజు సందర్భంగా తన 14 సంవత్సరాల ఏ విధంగా కొనసాగిందనే విషయం గురించి ఒక వీడియోని షేర్ చేశారు.

 Deepika Padukone Shares A Video Of Her Journey And Defines What Success Means To-TeluguStop.com

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా దీపిక పదుకొనే ఈ వీడియోని షేర్ చేస్తూ.

మీరు ఆనందంగా ఉండాలంటే మీకు ఇష్టమైన పనులను చేసినప్పుడే ఆనందం దొరుకుతుంది.అందుకే మీరు ఎల్లప్పుడు మీ మనసును అనుసరించండి.

మీకు తెలియని చోట కూడా మీకు తలుపులు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తాయని ఈమె తెలియజేశారు.అదే విధంగా ఈ వీడియోలో దీపికా పదుకునే అందుకున్న అవార్డులను ఆమె నటించిన రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘తమషా’ సినిమాలకి సంబంధించి మేకింగ్ సీన్స్ ఉన్నాయి.

ఇందులో మనిషిగా నేను ఎవరో మర్చిపోయాను నటిగా నేను వేరు… వ్యక్తిగతంగా నేను వేరు.నేను చాలా మారిపోయాను ఇంకా మంచిగా మారాల్సి ఉంది జీవితం అంటే ఇదే అంటూ ఈ సందర్భంగా దీపికా పదుకొనే తన పుట్టినరోజు తన జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇదిలా ఉండగా ఈమె తన భర్తతో కలిసి నటించిన 83 సినిమా మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube