ఆ హీరోని నేను మోసం చేయలేదంటున్న దీపికా.. కానీ అతడే...   

deepika padukone reveals why she is break up with her boy friend - Telugu Actress Deepika Padukone News, Deepika Padukone Break Up Latest News, Deepika Padukone Break Up News, Deepika Padukone Reveals Why She Is Break Up With Her Ex Boy Friend, Deepika Padukone Reveals Why She Is Break Updeepika Padukone Reveals Why She Is Break Up

బాలీవుడ్లో దాదాపుగా హీరోలతో సమానంగా క్రేజ్ మరియు స్టార్ డమ్ ఉన్నటువంటి హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు.ఈమె బాలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ల వరుసలో ఎప్పుడూ ముందు ఉంటుంది.

TeluguStop.com - Deepika Padukone Reveals Why She Is Break Up With Her Boy Friend

అయితే ఒక్క పారితోషికం విషయంలోనే కాకుండా తన నటన పరంగా కూడా దీపికా పదుకొనే సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

ఇప్పటికే పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలు మరియు ఎమోషనల్ సంబంధిత చిత్రాలలో పాత్ర ఏదైనప్పటికీ చక్కగా అందులో ఒదిగిపోయి తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.

TeluguStop.com - ఆ హీరోని నేను మోసం చేయలేదంటున్న దీపికా.. కానీ అతడే… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా దీపికా పదుకొనే ఓ ప్రముఖ ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొని తన లవ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా గతంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఓ హీరోతో ప్రేమలో పడ్డానని, అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో అతడి గురించి కొందరు తప్పుగా చెప్పినప్పటికీ తాను నమ్మలేదని అన్నారు.కానీ ఒకరోజున ఆ వ్యక్తి నిజ స్వరూపం ఏమిటో కళ్లారా చూశానని, అంతేగాక తన ప్రియుడు వేరే మహిళతో ఉండడాన్ని చూశానని, ఇంక అప్పటి నుంచి అతడిని చూస్తే తనకు అసహ్యం వేసేదని చెప్పుకొచ్చింది.అంతేగాక అతడితో ప్రేమలో ఉన్నప్పుడు నేను మరో వ్యక్తిని తప్పుడు దృష్టితో చూడలేదని కానీ తన ప్రియుడు మాత్రం చాలా మంది మహిళలతో సంబంధం పెట్టుకున్నాడని అందువల్లనే అతడితో బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చింది.

  కానీ ఒక్కసారిగా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని ఈ విషయం నుంచి తేరుకొని కోలుకోవడానికి చాలా కాలం పట్టింది అని అన్నారు.అయితే తన భర్త రణవీర్ సింగ్ కి ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసని అంతేగాక తాము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చింది.

అయితే ఇటీవల కాలంలో రణవీర్ సింగ్ తో పెళ్లయినప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాలు తగ్గించినట్లు తెలుస్తోంది.తాజాగా దీపికా పదుకొనే 83 అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.

#DeepikaPadukone #ActressDeepika #DeepikaPadukone #DeepikaPadukone #DeepikaPadukone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Deepika Padukone Reveals Why She Is Break Up With Her Boy Friend Related Telugu News,Photos/Pics,Images..