అకస్మాత్తుగా ఆ పని చేసేసిన దీపికా... అదేంటంటే?

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే నటిగా బాలీవుడ్ లో చేసిన పలు సినిమాల్లో ఆమె నటనకు అభిమానులు దాసోహమాయ్యారంటే దీపికా బాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ పేజీ లిఖించుకుందని చెప్పవచ్చు.

 Deepika Padukone Resigned To Mami Chair Person Post, Deepika Padukone ,deepika P-TeluguStop.com

ప్రముఖ బ్యాడ్ మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనే కూతురిగా ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా రంగంలో ప్రవేశంచి, ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు.ఎందుకంటే చిత్రపరిశ్రమ చాలా పోటీ ఉండే పరిశ్రమ ఒక్కసారి మీకు ఫ్లాప్స్ రావడం మొదలు పెడితే మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళయితే చాలా నిరాశకు గురవుతుంటారు.అదే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లయితే అప్పటికే వారి కుటుంబం ఎత్తు, పళ్ళాలను చూసి ఉంటారు కాబట్టి ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో సహజమనే మనస్తత్వంలో ఉంటారు.

కాని దీపికా విషయంలో అలా జరగలేదు వరుస బ్లాక్ బస్టర్ హిట్ లతో రికార్డ్ కలెక్షన్ లతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి తన రికార్డ్ ను తానే అధిగమించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయిని అలా నిలబెట్టుకుంటూ ఉంది.దీపికా ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ కు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే అకస్మాత్తుగా ఈ మామి చైర్ పర్సన్ కు రాజీనామా చేస్తున్నట్టు దీపికా ప్రకటించింది.అయితే నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల దీనికి న్యాయం చేయలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్టు దీపికా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube