కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాని పూర్తి చేశాడు.రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి కోలీవుడ్ లో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో విజయ్ కి ప్రతినాయకుడుగా విజయ్ సేతుపతి నటించడం విశేషం.ఇదిలా ఉంటే మాస్టర్ తర్వాత విజయ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
నెల్షన్ దిలీప్ దర్శకత్వంలో కొత్త మూవీ ఉండబోతుంది.ఇక ఈ సినిమాని విజయ్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారు.
ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నట్లు ఇప్పటికే కోలీవుడ్ లో వినిపిస్తుంది.తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం ఈ సినిమాలో విజయ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునేని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని సమాచారం.దీపికా పదుకునే కెరియర్ ఆరంభంలో ఫస్ట్ సినిమా కన్నడంలో ఉపేంద్రకి జోడీగా నటించింది.
తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి సౌత్ సినిమాలపై అస్సలు ఫోకస్ చేయలేదు.బాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
హిస్టారికల్ మూవీస్ లో కూడా నటించి మెప్పించింది.అయితే ఇన్నేళ్ల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కి జోడీగా మొదటి తెలుగు సినిమాలో నటిస్తుంది.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది.ఇప్పుడు ఫస్ట్ కోలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కోసం దీపికాకి ఏకంగా ఇరవై కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే.