తూచ్.. ప్రభాస్‌తో నటించడం లేదని అంటోన్న బ్యూటీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

 Deepika Padukone Not To Romance Prabhas-TeluguStop.com

ఈ సినిమాతో ప్రభాస్ తన స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తు్న్నాడు.ఇక ఈ సినిమా ఒక పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో ప్రభాస్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి.కానీ అవేమీ నిజం కాదని దీపికా పదుకొనే తెలిపింది.

తనకు ప్రభాస్ చిత్రానికి సంబంధించి ఎలాంటి పిలుపు రాలేదని ఆమె తెలిపింది.టాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే తప్పక నటిస్తానని చెప్పిన దీపికా, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సినిమాలను లైన్‌లో పెట్టే పనిలోనే బిజీగా ఉంది.

ఇక దీపికా తమిళంలో నటించినప్పటికీ తెలుగులో మాత్రం సినిమాలేమీ చేయలేదు.దీంతో ప్రభాస్ సరసన అయితే అమ్మడికి మంచి ఎంట్రీ ఉండేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మరి ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube