దీపికా సంపాదన 480 కోట్లు అంట... హీరోలని సైతం బీట్ చేసింది

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హీరోల కంటే హీరోయిన్స్ పారితోషికం ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది.ఈ విషయంపై హీరోయిన్స్ చాలా సందర్భాలలో స్పందించి కామెంట్స్ కూడా చేశారు.

 Deepika Padukone Highest Paid Actress In India, Bollywood, Indian Actress, Celeb-TeluguStop.com

తెరపై హీరోలతో సమానంగానే తమ పాత్రలు కూడా ఉన్న పారితోషికం విషయంలో మాత్రం ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తారు అంటూ ప్రశ్నించారు.హీరోలతో సమానంగా తమకి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని కొంత మంది హీరోయిన్స్ కాంపైన్ కూడా చేశారు.

ఆ తరువాత హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో కొంత మార్పు వచ్చింది.హీరోలతో సమానంగా కాకుండా వారికి కూడా గౌరవప్రదమైన స్థాయిలోనే రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

అయితే ఇండియన్ సినిమా అనేసరికి హీరోల ఇమేజ్ మీద ఎక్కువగా మార్కెట్ అవుతూ ఉంటాయి.స్టార్ హీరోలు అయితే వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్ బాగుంటుంది.

హీరోయిన్స్ ఇమేజ్ మీద మార్కెట్ అయ్యే సినిమాలు చాలా తక్కువ.ఒక వేళ అయినా కూడా కలెక్షన్ విషయంలో హీరోలతో పోటీ పడలేరు.
అయితే ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోలతో సమానంగా పోటీ పడుతుంది.కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తరువాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ హవా కొనసాగించి, హాలీవుడ్ లో సైతం ఇప్పుడు దీపికా పదుకునే సినిమాలు చేస్తుంది.

ఆమె ఇమేజ్ తో మార్కెట్ అవుతున్న సినిమాలు కూడా ఇప్పుడు ఉన్నాయి.హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రాణిస్తున్న దీపికా పదుకొనె సంపాదనలో కూడా వారితో పోటీ పడుతుంది.

అత్యధిక సంపాదనను ఆర్జిస్తున్న హీరోయిన్స్ లలో దీపిక మొదటి స్థానంలో నిలిచిందని సీఈవో వరల్డ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.దీపిక మొత్తం సంపాదన 480 కోట్లు అని తెలిపింది.

ఒక్కో సినిమాకి దీపికా కనీసం 14 నుంచి 18 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని సీఈవో వరల్డ్‌ పేర్కొంది.దీపిక తర్వాత అత్యంత సంపాదన ఆర్జించిన కథానాయికలుగా ప్రియాంక చోప్రా, కరీనాకపూర్‌, అనుష శర్మ ఉండటం విశేషం.

కేవలం సినిమాల ద్వారానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా దీపికా ఈ స్థాయిలో ఆదాయం సంపాదిస్తుందని సీఈవో వరల్డ్ పేర్కొంది.ప్రస్తుతం ఈ భామ షారుక్ ఖాన్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, డార్లింగ్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది.

ఇక ఈ పాన్ ఇండియా సినిమా కోసం దీపికా 20 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube