ప్రభాస్ వెంటపడుతున్న దీపికా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Deepika Padukone Following Prabhas, Prabhas, Deepika Padukone, Prabhas 21, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై చాలా పేర్లు వినిపించినా చివరకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాను పూర్తి సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా.ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో తన ప్రయాణం సాఫీగా సాగుతుందని ఆమె ఆశిస్తున్నట్లు పేర్కొంది.

అయితే సోషల్ మీడియాలో చాలా తక్కవ మందిని ఫాలో అయ్యే ప్రభాస్, ఈ సినిమాలో దీపికా హీరోయిన్ అని తెలియగానే ఆమెను ఫాలో అవుతున్నాడు.

ఇది గమనించిన దీపికా కూడా ప్రభాస్‌ను ఫాలో అవుతుండటంతో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక భారీ బడ్జెట్ చిత్రంగా రానున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube