దీపికపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్లు.. దాంతో ఆమె..?

పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు దీపికా పదుకొనే.అయితే ఈ మధ్య కాలంలో కొందరు నెటిజన్లు దీపికను టార్గెట్ చేస్తూ తరచూ ట్రోల్స్ చేస్తున్నారు.

 Deepika Padukone Fires Trollers Who Abuse Her Social Media, Abuse, Deepika Paduk-TeluguStop.com

సోషల్ మీడియాలో రోజురోజుకు వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో దీపిక ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు.తనపై అసభ్యంగా కామెంట్లు చేసేవాళ్లకు బుద్ధి వచ్చేలా దీపిక వ్యవహరించారు.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అసభ్యకర సందేశాలు పంపిన వారికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ మీ తల్లిదండ్రులు, స్నేహితులు మెసేజ్‌ల స్క్రీన్‌ షాట్‌ లను చూసి గర్విస్తారని పరోక్షంగా చురకలు అంటించారు.అయితే ఆ తరువాత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ నుంచి దీపిక స్క్రీన్ షాట్లకు సంబంధించిన స్టోరీని డిలేట్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్ లో 52 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న దీపిక కొన్ని రోజుల క్రితం అన్ని పోస్టులను డిలేట్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Abuse, Trollers-Movie

మరోవైపు దీపికా పదుకొనే వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనున్నారు.ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంధి.

సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో కూడా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు కపిల్ దేవ్ బయోపిక్ 83 మూవీలో కపిల్ దేవ్ భార్య పాత్రను దీపికా పదుకొనే పోషిస్తున్నారు.వయస్సు పెరుగుతున్నా దీపికా పదుకొనేకు అవకాశాలు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube