వాటా అడిగిన దీపిక.. టాటా చెప్పిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Deepika Padukone Demands Share Rights Of Prabhas Movie, Deepika Padukone, Prabha-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే ‘మహానటి’ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరపగా, ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రభాస్ సినిమా హిందీ రైట్స్‌ను తనకు ఇవ్వాలనే డిమాండ్‌ను దీపికా చిత్ర యూనిట్ ముందు పెట్టిందట.

దీంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న అశ్వినీ దత్ ఆమె డిమాండ్‌కు నో అని చెప్పేశాడట.

భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తే వేరే స్టార్ హీరోయిన్లు ఎవరైనా ఈ సినిమాలో చేస్తారని భావించిన ఆయన ఈ సినిమాలో దీపికాను తీసుకునే ఆలోచన మానుకున్నాడట.ఇక ప్రభాస్ సరసన పర్ఫెక్ట్‌గా సరిపోయే బ్యూటీ కోసం నాగ్ అశ్విన్ అండ్ టీమ్ తెగ వెతుకుతున్నారు.

కాగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా రానున్న ఈ చిత్రం సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌తో రానున్నట్లు తెలుస్తోంది.మరి ప్రభాస్ సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు కొట్టేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube