ఆ హీరోయిన్‌కే కాదు ఆమె బాడీగార్డ్‌కు కూడా కళ్లుచెదిరే రేటు!

సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ వసూలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు.కొందరు స్టార్ హీరోహీరోయిన్లు అయితే ఏకంగా సినిమా రంగానికి చెందిన వారిలోకెళ్లా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకూంటూ మిగతావారు తమను చూసి అసూయ పడేలా చేస్తుంటారు.

 Deepika Padukone Bodyguard Gets Awesome Salary, Deepika Padukone, Bodyguard, Rem-TeluguStop.com

ఈ కోవలోకే చెందింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతున్న ఈ బ్యూటీ, రెమ్యునరేషన్ పరంగా కళ్లు చెదిరే మొత్తాన్ని తీసుకుంటోంది.

అయితే ఇంత భారీ మొత్తంలో తీసుకుంటున్న దీపికా బాడీగార్డ్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తుందో అనే సందేహం అందరిలో నెలకొంది.కాగా దీపికాను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చే బాడీగార్డ్ జమాల్‌కు ఆమె ప్రతినెలా రూ.6.5 లక్షలు ముట్టజెప్పుతుందట.ఓ బార్డీగార్డ్‌కు ఇంత భారీమొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం దీపికాకే చెల్లింది.తన పర్సనల్ బాడీగార్డ్‌గా జమాల్ దీపికా ఇచ్చే మొత్తం ఓ టాప్ కంపెనీ ఉద్యోగికంటే కూడా ఎక్కువనే చెప్పాలి.

మొత్తానికి ఓ స్టార్ బ్యూటీ బార్డీగార్డ్‌కు ఇంత భారీ రెమ్యునరేషన్ ఉందనే వార్త నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అనే మాట మాత్రం అందరూ నమ్మాల్సిందే.అటు దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాలీవుడ్‌లో బిజీ హీరోగా ఉన్నాడు.

ఇలా ఇద్దరు భార్యభర్తలు కలిసి బాలీవుడ్‌లోకెళ్లా ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న జంటగా నిలివడంతో వారి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube