మహేష్ తో రొమాన్స్ కి రెడీ అంటున్న దీపికా పదుకునే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా అక్కడి హీరోయిన్స్ కూడా కలల రాకుమారుడుగానే ఉన్నాడు.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న చాలా మందికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంటే ఇష్టం.

 Deepika Open Up To Ready For Romance With Mahesh Babu-TeluguStop.com

టాలీవుడ్ లో మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే భామలు కూడా ఉన్నారు.అయితే ఈ విషయాలని అప్పుడప్పుడు వారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చెబుతూ ఉంటారు.

సౌత్ ఇండియా బ్యూటీ, మంగళూరు భామ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆమె మొదటి సినిమాని కన్నడలో ఉపేంద్రతో చేసింది.

తరువాత ముంబై చెక్కేసి అక్కడ బాలీవుడ్ సినిమాలలో సత్తా చాటి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.హాలీవుడ్ సినిమాలలో కూడా చేసే ఛాన్స్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ 1983 ఇండియన్ క్రికెట్ వరల్డ్ కప్ నేపధ్యంలో 83 టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది.ఇందులో మొగుడుపెళ్లాలైన రణవీర్ సింగ్, దీపికా పదుకునే కపిల్ దేవ్, అతని భార్య పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుపై తన ఇష్టాన్ని షేర్ చేసుకుంది.తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నా, దాని కోసం కథలు కూడా విన్నా అని చెప్పిన ఈ భామ టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం అని అవకాశం వస్తే అతనితో నటించడానికి తాను సిద్ధం అని చెప్పింది.

అలాగే ఇప్పుడు సినిమాకి లాంగ్వేజ్ బారియర్స్ లేవని, ఏ భాషలో చేసిన ఇతర భాషలలో ఆ సినిమా రిలీజ్ అవుతుంది.అందుకే సౌత్ లో నటించడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా అంటూ దర్శకులకి హిట్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube