మరొక తెలుగు ప్రాజెక్ట్ లో దీపికా..ఈసారి బయోపిక్ తో..!

బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో దీపికా పడుకొనే ఒకరు.ఈమె బాలీవుడ్ లోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది.

 Deepika Is Coming Up With A Pv Sindhu Biopic This Time Details, Pv Sindhu, Deepi-TeluguStop.com

ఈమె అందం మాత్రమే నమ్ముకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.వరుస హిట్స్ తో ఈ బ్యూటీ అగ్ర స్థానంలో కొనసాగుతుంది.

ఎక్కువ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను, అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువుగా చేస్తూ వరుస హిట్స్ అందుకుంటుంది.తాజాగా ఈ అమ్మడు మరొక బయోపిక్ కోసం రెడీ అవుతుందని సమాచారం.

అది కూడా తెలుగు బయోపిక్ అని తెలుస్తుంది.ఈ అమ్మడు పి వి సింధు బయోపిక్ లో నటించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈమె నిజ జీవితంలో కూడా బ్యాట్మింటన్ ప్లేయర్ అని మన అందరికి తెలుసు.

అయితే ఇప్పుడు నిజ జీవితంలో బ్యాట్మింటన్ ప్లేయర్ అయినా దీపికా ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా బ్యాట్మింటన్ ప్లేయర్ గా నటించ బోతుంది.

Telugu Badminton, Biopic, Deepikapv, Pan India, Pv Sindhu, Top Deepika-Movie

ఒలంపిక్స్ లో బ్యాట్మింటన్ మెడల్ సాధించిన మన తెలుగు అమ్మాయి పి వి సింధు స్టోరీని మన ముందుకు తీసుకు రాబోతున్నారు.అందులో పి వి సింధుగా దీపికా నటించ బోతుందని సమాచారం అందుతుంది.

Telugu Badminton, Biopic, Deepikapv, Pan India, Pv Sindhu, Top Deepika-Movie

దీపికా సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టక ముందు కొన్నాళ్ళు బ్యాట్మింటన్ ప్రాక్టీస్ చేసి మ్యాచ్ లు కూడా ఆడింది.దీపికా తండ్రి ప్రకాష్ కూడా బ్యాట్మింటన్ ప్లేయర్.అందుకే దీపికా కూడా బ్యాట్మింటన్ ప్రాక్టీస్ చేసేది.ఈ సినిమాను దీపికా తన సొంత బ్యానర్ అయినా కా ప్రొడక్షన్ లోనే తెరకెక్కించ బోతున్నారట.ఈ మధ్య దీపికా, సింధు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube