వైరల్ అవుతున్న దీపిక - రన్వీర్ డాన్స్ వీడియో..!

బాలీవుడ్ లో అనేకమంది క్రేజీ జంటలలో బాగా పేరు పొందిన క్రేజీ కపుల్ దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ జంట.వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుని 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 Deepika Goes Viral Ranveer Dance Video Deepika Padukune, Ranaveenr, Viral Video-TeluguStop.com

ప్రస్తుతం వీరిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు.ఒకవైపు ప్రకటనలతో.

మరోవైపు సినిమాలతో అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వారి అభిమానులను తెగ ఉత్సాహపరుస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నారు.వీరిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల పోస్టులు చేస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వీడియో ని పోస్ట్ చేసింది దీపికా పడుకొనే.భార్యాభర్తలు ఇద్దరూ చేసిన డాన్స్ వీడియోను తాజాగా దీపికా పడుకొనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యంగా ఈ వీడియోలో రన్వీర్ కపూర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ చూసి ఆయన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.2013 సంవత్సరంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నటించిన రామ్ లీలా చిత్రంలో, ఆ తర్వాత 2018 లో వచ్చిన బాజీరావ్ మస్తానీ చిత్రంలో మరోసారి నటించారు.ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బాలీవుడ్ లో నిర్మితమవుతున్న కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83 లో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో రన్వీర్ కపిల్ దేవ్ పాత్ర పోషిస్తుండగా ఆయన భార్య దీపికా పడుకొని కపిల్ దేవ్ భార్య రోమి పాత్రలో నటిస్తున్నారు.

ఈ వీడియోలో వీరిద్దరూ వేసిన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube