ఇదిగో శుభలేఖ ! రణవీర్- దీపిక పెళ్లి ఫిక్స్     2018-10-21   22:14:12  IST  Sai Mallula

బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పదుకోణ్, రణవీర్ సింగ్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారు. చాలా కాలంగా… వీరి ప్రేమ, పెళ్ళి గురించి రకరకాల వార్తలు , ఊహాగానాలూ వినిపించాయి.అయితే… వాటన్నిటికీ చెక్ పెడుతూ, తమ వెడ్డింగ్ కా‌ర్డ్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీపికా పదుకునే. నవంబర్ 14,15 తేదీల్లో తామిద్దరం ఒకటవబోతున్నామని చెప్పుకొచ్చింది.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న శుభలేఖలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Deepika And Ranveer Singh Get Married November 14th And15th-

Deepika And Ranveer Singh Get Married November 14th And15th

దీపికా, రణవీర్ కలిసి రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో నటించి, ఆన్‌స్క్రీన్ రొమాంటిక్ కపుల్‌గా పేరుతెచ్చుకున్నారు.. ఇప్పటికే పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాయని, డ్రెస్‌ల డిజైన్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.. రెండు రోజులపాటు జరగబోయే దీపికా, రణవీర్‌ల మ్యారేజ్ బాలీవుడ్‌లో ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.