మన హిందూ సంప్రదాయం ప్రకారం దీపారాధన చేయటానికి కొన్ని పద్ధతులఉన్నాయి.చాలా మంది దీపారాధన చేసే సమయంలో కుందిలో వత్తి వేసి ఆ తర్వానూనె పోస్తూ ఉంటారు.ఆలా చేయటం తప్పు.కుందిలో ముందు నూనె పోసాక వత్తవేయాలి.
దీపారాధన చేయటానికి వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడకుందులు మట్టి కుందులు శ్రేష్ఠమైనవి.అయితే ఎట్టి పరిస్థితిలోను స్టీలకుందిలో దీపారాధన చేయకూడదు.
కార్తీక మాసం వంటి పర్వదినాల్లో దీపారాధనను రాగి కుందిలో చేస్తే మంచిదిదీపారాధన చేసేటప్పుడు కుంది కింద పళ్లెం లేదా తమలపాకు వేయాలి.దీపారాధచేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి.దీపారాధన ఎప్పుడు ఏక వత్తితో చేయకూడదు.అమ్మవారి ముందు బియ్యం పోసి దానమీద వెండి కుందిలో దీపారాధన చేస్తే తెలివితేటలు,మేధస్సు పెరిగి సంపాదపెరుగుతుంది.తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులరావని నమ్మకం.శ్రీమహాలక్ష్మికి దీపారాధన చేస్తే ఆవునెయ్యి, శ్రీమహావిష్ణువుశ్రీసుబ్రహ్మణ్య స్వామికి నువ్వుల నూనె,శ్రీమహాగణపతికకొబ్బరినూనె మంచిది.అయితే దీపారాధనకు ఎట్టి పరిస్థితిలోను శనగనూనవాడకూడదు.