అమెరికాలో భారతీయుడి అరెస్ట్..౩.5 కోట్ల జరిమానా..రెండేళ్ళ జైలు..ఎందుకంటే..

అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న భారతీయుడికి ఒక్క సారిగా తన కంపెనీ పై కోపం వచ్చింది.ఉద్యోగం నుంచీ తనను తొలగించారనే కోపంతో తన ప్రతిభను అంతా చూపించి కంపెనీకి చెందిన 1200 మంది యూజర్స్ మైక్రోసాఫ్ట్ ఎకౌంటు లను హ్యాక్ చేసి తొలగించేశాడు దాంతో తలలు పట్టుకున్న సదరు కంపెనీ అతడిపై కేసు నమోదు చేసింది.

 Deepanshu Kher Arrest In Us For  Delete 1200 Microsoft User Accounts In Us , Cal-TeluguStop.com

అయితే అతడికి తాజాగా అమెరికా కోర్టు రెండేళ్ళ భారీ జరిమానాతో పాటు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది.ఇంతకీ అతడి కోపానికి కారణం ఏంటంటే.

ఢిల్లీ కి చెందిన దీపాన్షు కేర్ అనే వ్యక్తి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాడు.కాలిఫోర్నియాలో లోని ఓ ప్రాంతంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీ దీపాన్ష్ పనిచేస్తున్న కంపెనీ తో మైక్రోసాఫ్ట్ ౩65 కు మైగ్రేట్ అవ్వడం కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్రమంలోనే దీపాన్షు ను సదరు కంపెనీ 2017 లో అమెరికాకు పంపింది.అయితే దీపాన్షు చేస్తున్న పని విధానం కానీ, అతడి ప్రవర్తన కాని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీకు నచ్చలేదు, రోజు రోజుకు దీపాన్ష్ ప్రవర్తనపై విసుగు చెందిన కంపెనీ భారత్ లో ఉన్న అతడి యాజమాన్యానికి చెప్పింది.

దాంతో 2018 లో దీపాన్షు భారత్ చేరుకున్నాడు.యధావిధిగా తన విధులు నిర్వహిస్తున్న తరుణంలో సదరు కంపెనీ దీపాన్షు ను ఉద్యోగం నుంచీ తొలగించింది.

దాంతో అమెరికాలోని కార్ల్ బాడ్ కంపెనీపై ద్వేషం పెంచుకున్న దీపాన్ష్ సదరు కంపెనీ కి చెందిన 1200 మైక్రోసాఫ్ట్ ఎకౌంట్లను హ్యాక్ చేసి డిలీట్ చేశాడు.దీపాన్షు చర్యల కారణంగా కార్ల్ బాడ్ కంపెనీ సుమారు 5.67 వేల డాలర్లు నష్ట పోవడంతో దీపాన్షు పై అమెరికాలో కేసు నమోదు చేసింది.ఇదిలాఉంటే అప్పటి నుంచీ ఈ కేసు పెండింగ్ లో ఉండగా దీపాన్షు జనవరి నెలలో అమెరికా వెళ్ళడంతో అలెర్ట్ అయిన అమెరికా సైబర్ అధికారులు అతడి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.కేసుని పరిశీలించిన కోర్టు అతడికి సుమారు ౩.5 కోట్ల భారీ జరిమానాతో పాటు, రెండేళ్ళ జైలు శిక్ష విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube