దీపావళి రోజు ఈ చిన్న చిన్న పనులను చేస్తే అదృష్టం మీ వెంటే...  

Deepaavali Roju Ilaa Cheshte Manchidi -

దసరా అయ్యాక దీపావళి వస్తుంది.దీపావళి పండుగ వచ్చిందంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరికి హుషారు వస్తుంది.

దీపావళి రోజున లక్ష్మి దేవిని పూజిస్తారు.శక్తి ఉన్నవారు బంగారాన్ని కొని దీపావళి రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు.

Deepaavali Roju Ilaa Cheshte Manchidi-Devotional-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత బాణాసంచా కాలుస్తారు.అయితే దీపావళి రోజు కొన్ని చిన్న చిన్న పనులను చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

దీపాలు వెలిగించటానికి మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి.

అమ్మవారి వద్ద సుంగంధ భరిత అగరబత్తులను వెలిగిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి

దీపావళి రోజు ఎర్రటి వస్త్రంలో ఎర్ర పువ్వు,ఎర్ర చందనం,కుంకుమ పెట్టి పూజ చేసి, ఆ తర్వాత బీరువాలో పెట్టుకుంటే ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి లాభాలు వస్తాయి

దీపావళి రోజున లక్ష్మి దేవి గుడికి వెళ్లి అమ్మవారికి వస్త్రాలను బహుకరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

పచ్చి శనగపప్పును లక్ష్మీదేవి మీద అక్షింతలు లా వేయాలి.

ఆ తరవాత వాటిని సేకరించి రావి చెట్టు మొదల్లో వెయ్యాలి.

దీపావళి రోజున రాగి చెంబులో నీరు పోసి దానిలో పసుపు వేసి పూజ గదిలో పెట్టాలి.

పూజ అయ్యాక ఆ నీటిని పువ్వుతో ఇల్లంతా జల్లితే లక్ష్మి దేవి ఇంటిలో స్థిరపడుతుంది.

దీపావళి రోజున చెరకు గడను నైవేద్యంగా పెడితే శుభం కలుగుతుంది

ఈ చిన్న చిన్న పనులను దీపావళి రోజున చేస్తే అదృష్టం మరియు ధన వృద్ధి కలుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL