స్కూల్లో చేరడానికి పనికిరాడన్నారు: జ్ఞాపకశక్తితో భారతీయ విద్యార్ధి అద్భుతాలు

స్కూలులో అడ్మిషన్ పొందడానికి అనర్హుని అనిపించుకున్న ఓ భారతీయ విద్యార్ధి తన అసాధారణ జ్ఞాపకశక్తితో యూఏఈలో అందరి మన్ననలు పొందుతున్నాడు.వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన రోహిత్‌పరితి రామకృష్ణన్ గతం, భవిష్యత్‌‌కు సంబంధించిన సంవత్సరాలను, తేదీలను సెకన్లలోనే చెబుతూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నట్లు ఖలీజ్ టైమ్స్ తన వార్తా కథనంలో పేర్కొంది.

 Deemed Unfit For School Dreams With Exceptional Memory-TeluguStop.com

పుట్టుకతోనే 1 కేజీ బరువుతో జన్మించిన రామకృష్ణన్‌ను ఇంక్యుబేటర్‌లో నెలల తరబడి ఉంచడంతో పాటు ఎన్నో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.అయితే రెండేళ్లు తిరగకముందే అతనిని వైద్యులు ఆటిస్టిక్‌గా నిర్థారించారు.

తమ బాబు హైపర్ యాక్టివ్‌గా ఉన్నందున అతను సాధారణ పాఠశాలకు వెళ్లేందుకు అనర్హుడని స్కూలు యాజమాన్యాలు తెలిపాయని రామకృష్ణణ్ తల్లి మాలిని తెలిపారు.ఇదే సమయంలో పిల్లవాడిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్చించాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు.

Telugu Deemedunfit, Telugu Nri Ups-

కాలక్రమంలో రామకృష్ణన్‌లో ప్రత్యేకమైన ప్రతిభ ఉందని తల్లిదండ్రులు గుర్తించారు.అతను టీవీలో విన్న పాటలను హమ్ చేయడంతో పాటు మ్యాథమేటిక్స్‌ను వేగంగా చేసేవాడని మాలిని వెల్లడించారు.ఈ క్రమంలో 2018లో రోహితిపరితి రామకృష్ణన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిర్వహించిన 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.ఈ క్రమంలో తమ బిడ్డ జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి 10 సంవత్సరాలు, తేదీలను అడిగ్గా.

ఇందుకు రామకృష్ణన్ సరిగ్గా అతను సరిగ్గా సమాధానం ఇచ్చాడు.దీనితో పాటు వివిధ సంస్థలు నిర్వహించిన ఎలక్ట్రానిక్ కీబోర్డ్‌ పోటీలలో ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు.

ఒకసారి వింటే, ఎలాంటి సంగీతాన్ని అయినా ఇట్టే పట్టేయగలడు.పవిత్ర భగవద్గీతలోని 40పైగా శ్లోకాలను అనర్గళంగా చెప్పగలడని మాలిని ఉద్వేగంగా చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube