Revanth Reddy : తగ్గేదేలే :  రేవంత్ పై ఫిర్యాదుకు ఢిల్లీకి కదిలిన  సీనియర్లు ! 

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.టిఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ స్థానాన్ని బిజెపి ఆక్రమించేసింది.

 Decreasing Seniors Moved To Delhi To Complain About Revanth, Telangana, Congress-TeluguStop.com

తెలంగాణలో బిజెపి, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం హోరాహోరీగా తలపడుతుండగా, కాంగ్రెస్ మాత్రం ఇంకా గ్రూపు రాజకీయాలతోనే సతమతమవుతోంది.తెలంగాణలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది.

ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా, బిజెపి గట్టి పోటీ ఇచ్చింది.అయినా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఇంకా ఐకమత్యం కనిపించడం లేదు.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు మరో ముందడుగు వేశారు.
  కొత్తగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే ను కలిసినందుకు ఢిల్లీకి వెళ్లి రేవంత్ పై ఫిర్యాదులు చేశారు.

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన సమయంలోనే , ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గే తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.త్వరలోనే పార్టీలో భారీగా మార్పు చేర్పులు ఉంటాయని టి.పిసిసి , డిసిసిల్లో కూడా మార్పులు ఉంటాయని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి లీకులు రావడంతో,  రేవంత్ ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడితో ఈ పదవుల అంశంపై మాట్లాడారట.
 

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Telangana-Political

త్వరలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సైతం మార్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం టీపీసీసీ, డిసిసిలలో మార్పులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరగబోతుండడంతో, కొన్ని జిల్లాల్లో టిపిసిసిలు కేవలం రేవంత్ రెడ్డి సూచనలు ప్రకారం మార్పులు చేయవద్దని సీనియర్లు మల్లికార్జున్ ఖర్గేతో చెప్పినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పైనే కాంగ్రెస్ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు.

ఈ సమయంలో సీనియర్ల మాటను ఎంతవరకు పట్టించుకుంటారు అనది అనుమానమే.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube