వైసీపీ ఎమ్మెల్యేల‌కు త‌గ్గుతున్న డిమాండ్‌.. కార‌ణం అదేనా..?

ఎమ్మెల్యే అంటే ఒక నియోజ‌క‌వ‌ర్గానికి మొద‌టి వ్య‌క్తి లాంటి వాడు.ఆయ‌న చేతిలోనే అభివృద్ధి అనేది ఉంటుంది.

 Declining Demand For Ycp Mlas Is That The Reason Details, Ycp Mlas, Jagan, Grama-TeluguStop.com

ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా స‌రే ఆయ‌నే తీర్చుతార‌నే న‌మ్మ‌కం.అందుకే ఆయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ ప్ర‌జ‌లు ఉంటారు.

ఇక ఏదైనా పండుగ కార్య‌క్ర‌మం ఉంటే.క‌చ్చితంగా ఆయ‌న‌కు అంద‌రూ విషెస్ చెబుతుంటారు.

ఇందులో ఎవ‌రైనా ఒక్క‌టే.అయితే ఇటీవ‌ల ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేల‌కు డిమాండ్ త‌గ్గింద‌ని చెబుతున్నారు.

ఇందుకు కార‌ణాలు కూడా అనేకం ఉన్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

మొన్న జ‌న‌వ‌రి 1 నాడు న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పేందుకు చాలామంది వ‌స్తుంటారు.

కానీ వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంలో మాత్రం అంతా తారు మారులా ఉంది.ఎందుకంటే వారికి విషెస్ చెప్పేందుకు ఒక్క‌రు కూడా రాక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎంతో ప‌వ‌ర్ ఉంటుంది.అందుకే వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలామంది వారి వ‌ద్ద‌కు క్యూ క‌డుతారు.

కానీ వైసీపీ ఎమ్మెల్యే ఇండ్ల ద‌గ్గ‌ర గానీ.లేదా క్యాంప్ ఆఫీస్ ద‌గ్గ‌ర గానీ ఎలాంటి సంద‌డి లేదు.

ఇందుకు కొన్ని కార‌ణాలు ఉన్నాయి.

ఎందుకంటే ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌నులు కావాల‌న్నా స‌రే ప్ర‌తీదీ గ్రామ స‌చివాల‌యం ద‌గ్గ‌రే అయిపోతుంది.ఏపీలో సచివాలయ కార్యదర్శల్ని ఎక్కువ‌గా నియ‌మించ‌డంతో గ్రామంలో ప్ర‌తీదీ వారి ద‌గ్గ‌రే అయిపోతోంది.దీతో గ్రామాల‌ ప్రజ‌లు ఎమ్మెల్యే దాకా వెళ్లాల్సిన అవ‌స‌రం రావ‌ట్లేదు.

అందుకే ఎమ్మెల్యేల‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు.ఇలాగే కొన‌సాగితే త‌మ‌ను నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రూ గుర్తించ‌ర‌ని కొత్త‌గా గెలిచిన ఎమ్మెల్యేలు బాధ ప‌డుతున్నారంట‌.

అయితే ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం జ‌గ‌న్ చేసిన ప‌నులు ఇలా ఎమ్మెల్యేల డిమాండ్‌ను త‌గ్గిస్తోంద‌న్న‌మాట‌.ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అనేది మాత్రం వేచి చూడాలి.

YCP MLAs Craze Declining in AP #Politics

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube