మూడు రాజధానుల బిల్లుపై టీడీపీ మాట ఇలా... వైసీపీ మాట అలా

ఏపీ మూడు రాజధానులలు, సిఆర్డీఏ రద్దు బిల్లులకి గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దీంతో టీడీపీ హయాంలో పరిపాలనా రాజధానిగా ఉన్న అమరావతి తన హోదాని కోల్పోయి కేవలం కార్యనిర్వాహక రాజధానికి పరిమితం అయిపొయింది.

 Tdp Criticized On Ysrcp On Ap 3 Capitals Bill, Decentralized, Crda Bill, Ap Poli-TeluguStop.com

ఇక విశాఖని పూర్తిస్థాయిలో పరిపాలనా రాజధానిగా మార్చడానికి మార్గం సుగమం అయిపొయింది.ఇక గవర్నర్ ఈ మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలపడంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయాయి.

ఇక వైసీపీ నేతలు మీడియా ముందుకి వచ్చి గవర్నర్ ఆమోదంతో ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి బీజం పడినట్లు అయ్యిందని చెప్పుకొచ్చారు.ఇక మంత్రి బొత్స మరో అడుగు ముందుకి వేసి త్వరలో జగన్ విశాఖలో రాజధాని కోసం శంకుస్థాపన చేస్తారని చెప్పేశారు.

ఇక మూడు ప్రాంతాలకి అభివృద్ధి ఫలాలు అందించాలకే లక్ష్యం ఈ బిల్లుతో సాధ్యం అవుతుందని వైవి సుబ్బారెడ్డి అన్నారు.

ఇక వైసీపీ నేతల మాటలు ఇలా ఉంటే ఇక అమరావతి రాజధానిగా ఇక ఉండదని అర్ధమైన టీడీపీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని, ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు.

మరో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని అన్నారు.ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం అని నారా లోకేష్ అన్నారు.

న్యాయ స్థానంలోనే ప్రజల ఆకాక్షలకి న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.ఈ మూడు రాజధానుల బిల్లుపై మరోసారి వైసీపీ సర్కార్ కి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తప్పవని టీడీపీ నేతలు అన్నారు.

మరి తారాస్థాయికి చేరుకున్న ఈ మూడు రాజధానుల రచ్చ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube