December Tollywood Movies: డిసెంబర్ నెలలో ఇన్ని సినిమాలా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో డిసెంబర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

 December Month Movies Reviews Dhamaka 18pages Hit2 Latthhi Details, December Tol-TeluguStop.com

గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన పుష్ప ది రైజ్, అఖండ సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ఏడాది కూడా ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలలో పలు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఫస్ట్ వీక్ హిట్2 సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

నాని నిర్మాతగా వ్యవహరించడం అడివి శేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అడివి శేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరతాడని చెప్పవచ్చు.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా కూడా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Adivi Sesh, Annimanchi, December, Dhamaka, Lathhi, Nikhil Pages, Raviteja

ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన ధమాకా మూవీ కూడా ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.లాఠీ, అన్నీ మంచి శకునములే మూవీలు కూడా ఈ నెలలో థియేటర్లలో విడుదల కానున్నాయి.

Telugu Adivi Sesh, Annimanchi, December, Dhamaka, Lathhi, Nikhil Pages, Raviteja

రవితేజకు ఈ ఏడాది కీలకం కావడంతో రవితేజ కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మాస్ మహారాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు.డిసెంబర్ నెల ఏ హీరోలకు భారీ సక్సెస్ ను అందిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube