డిసెంబర్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి నమ్మలేని కొన్ని నిజాలు     2018-02-12   06:07:11  IST  Raghu V

ఈ నెలలో పుట్టినవారు మంచి విద్యావంతులుగా ఉంటారు. అంతేకాక వీరికి దయ మరియు బుద్ధిబలం ఉండటమే కాకుండా దైవభక్తి కూడా అధికంగానే ఉంటుంది. వీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉండుట వలన నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. వీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తిగా లీనమై పట్టుదల,కార్యదీక్షతో ఉంటారు.

ఒక పనిని మొదలు పెడితే ఆ పని పూర్తీ అయ్యేవరకు మరో పని జోలికి వెళ్లకుండా చేసే పని మీదే ఎక్కువ దృష్టి పెడతారు. వీరికి బుద్ది కుశలత ఎక్కువగా ఉండుట వలన ఏ విషయాన్నీ అయినా సులభంగా అర్ధం చేసుకుంటారు. వీరికి చాలా సహనం తక్కువగా ఉంటుంది. అలాగే నీతి నిజాయితీ,మాట పట్టింపు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏ పనిని అయినా స్వయంగా చేయాలనీ అనుకుంటారు. ఇతరులు చేస్తే వీరికి నచ్చదు.


పరిస్థితులకు తల వంచకుండా బ్రతకాలని అనుకుంటారు. వీరికి సహనం కాస్త తక్కువగా ఉంటుంది. వీరు నిర్ణయాలను చాలా వేగంగా తీసుకుంటారు. వీరు ప్రేమతో ఇతరుల మనస్సులను గెలుచుకుంటారు. వీరిలో ఎక్కువగా పండితులుగాను, విద్యా వంతులుగాను రాణిస్తారు.

ఆరోగ్యం : రక్తహీనత, లివర్ వ్యాధులు, నీరసం, తలనొప్పి ఎక్కువగా సంభవిస్తుంటాయి.

ధనము : మంచి ఉద్యోగాలు చేస్తారు.

లక్కీ వారములు : మంగళవారము.

లక్కీ కలర్ : ఆకుపచ్చ, వంకాయ రంగు.

లక్కీ స్టోన్స్ : పగడము, ఆకుపచ్చ రాయి మరియు వంకాయ రంగు రాయి.