డిసెంబ‌రు 26న వీర్ బాల్ దివ‌స్: ప్ర‌క‌టించిన ప్రధాని మోదీ

10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక‌ ప్రకటన చేశారు.గురుగోవింద్ సింగ్ సాహిబ్‌కు నివాళులర్పించిన ఆయన ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్ర‌తీయేటా వీర్ బాల్ దివ‌స్ జ‌రుపుకోనున్నట్లు తెలిపారు.

 December 26 To Be Observed As 'veer Baal Diwas' As Tribute To Guru Gobind Singh'-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన పలు ట్వీట్లు చేశారు.గురు గోవింద్ సింగ్ జన్మదినమైన ప్రకాష్ పర్వ్ సందర్భంగా ఇక‌పై భారతదేశం డిసెంబర్ 26న వీర్ బాల్ దివ‌స్ జరుపుకోనుందని తెలియజేయడానికి తాను చాలా సంతోషిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

ఈ దేశం కోసం ప్రాణాల‌ర్పించిన‌ సాహిబ్‌జాదే జోరావర్ సింగ్, సాహిబ్జాదే ఫతే సింగ్‌లను స్మ‌రిస్తూ ఆ రోజు వీర్ బాల్ దివ‌స్ నిర్విహించ‌నున్నామ‌ని ఆయన ట్వీట్ చేశారు.ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు వీర‌ మరణాన్ని ఎంచుకున్నార‌న్నారు.

మరో ట్వీట్‌లో.మాతా గుజ్రీ దేవి, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, వారి నలుగురు సాహిబ్జాదాల శౌర్యం కోట్లాది భార‌తీయ‌ ప్రజలకు ధైర్యాన్నిస్తుంది.ఈ మహానుభావులు అన్యాయానికి తల వంచలేదు.ఇప్పుడు ప్రజలు వారి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించే సమయం వచ్చింద‌న్నారు.

కాగా డిసెంబర్ 26న‌ వీర్ బల్ దివ‌స్‌ జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశంసించారు.ఈ నిర్ణయం స్వాగతించదగినదేనని ఆయన అన్నారు.

సాహిబ్జాదాలు చూపిన ధైర్యం అసమానమైనది.వారి త్యాగం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల‌న్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube