ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల అయ్యాయి.మరికొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
ఈ సినిమాలు చేసిన వారిలో చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ ఉన్నారు.ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్స్ విడుదల అయ్యాయి.
ఆయా సినిమాలపై మంచి హైప్స్ పెంచాయి.ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ కలిగించి ఈఏడాది తెరమీద కనిపించిన, కనిపించబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బుచ్చిబాబు- ఉప్పెన
బుచ్చి బాబు డెబ్యూ మూవీ ఉప్పెన.విడులకు ముందే మంచి పాటిజివ్ టాక్ తెచ్చుకుంది.అదే హైప్ కొనసాగిస్తూ.మూవీ రిలీజ్ అయ్యింది.ప్రేక్షకులు ఈసినమాకు బ్రహ్మరథం పట్టారు.తొలి సినిమాతోనే బుచ్చి బాబు మంచి సక్సెస్ సాధించారు.
ప్రదీప్ కృష్ణ మూర్తి- కపటధారి
కన్నడలో మంచి విజయం సాధించిన కావలుధారి సినిమాకు ఈ మూవీ రీమేక్.సుమంత్ హీరోగా చేస్తున్న తన తొలి సినిమాతో ప్రదీప్ లక్ నిరూపించుకోనున్నాడు.
కిశోర్ రెడ్డి- శ్రీకరం
శర్వ హీరోగా రైతుల మీద విలేజ్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్, పాటలు మంచి టాక్ సంపాదించుకున్నాయి.
అనుదీప్- జాతి రత్నాలు
నవీన, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ సినిమా కామెడీ మూవీగా తెరకెక్కింది.మంచి విజయం సాధించింది.
కౌషిక్- చావు కబురు చల్లగా
కార్తికేయ హీరోగా వసస్తున్న ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కుతోంది.పోస్టర్, టీజర్ కొత్తగా అనిపించాయి.
కిరణ్ కొర్రపాటి- ఘని
వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.తన 10 సినిమాగా వస్తున్న ఘని బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది.ఈ సినిమా పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.