గుడ్ న్యూస్: ఇక పై డెబిట్ కార్డ్ అవసరం లేకుండా.. మొబైల్ ‏తోనే డబ్బులు విత్ డ్రా..??

కరోనా టైంలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.కరోనా రూల్స్ పాటిస్తూ ఇంటిపట్టునే ఉంటున్నారు.

 Debit Card, Money With Draw, Icici Bank ,card Less, Viral,latets  News-TeluguStop.com

అయితే ఖర్చుల కోసం డబ్బులు అవసరమైనప్పుడు దగ్గర్లోని ఏటిఎంకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నారు.చాలా మంది కరోనా ఎక్కడ సోకుతుందేమోనని ఏటిఎంలకు కూడా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

ఇటువంటి సమయంలో వారికి ఓ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది.ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు కావాలి.

డెబిట్ కార్డు ద్వారా మనం ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం.అయితే బ్యాంకులు ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఈ తరహా సేవలు అందిస్తోంది.ఇటీవలనే బ్యాంక్ ఈమెయిల్ ద్వారా తన కస్టమరలకు డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియజేసింది.

మొబైల్ ఫోన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ iMobile App ద్వారా సులభంగానే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన తర్వాత అక్కడ ఏటీఎంలో కార్డ్‌లెస్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకోవడ వల్ల కార్డ్ స్కిమ్మింగ్ మోసాల నుంచి తప్పించుకోవచ్చు.అలాగే ఏటీఎం పిన్ అవసరం ఉండదు.

ఇంకా ఎలాంటి చార్జీలు పడవు.కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇంకా పలు రకాల బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు కార్డ్ లెస్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు అందిస్తున్నాయి.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు అయితే యోనో యాప్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.ఈ మధ్యనే ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మార్చింది.కొన్ని టెన్యూర్‌లో మాత్రమే వడ్డీ రేట్లను మార్చింది.50 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించింది.91 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube