ఏపీలో జగన్ సర్కారు గెలుపు మీద జోరుగా చర్చ... పక్క రాష్ట్రాల్లో కూడా..

ఏపీ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో సునామీ క్రియేట్ చేసిన వైసీపీ సర్కారు మరో సారి గెలుస్తుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.ఈ చర్చ ఏపీ రాష్ట్రంలో నడుస్తుందంటే ఏమో అనుకోవచ్చు.

 Debate Over Jagan Govt Victory In Ap Even In Neighboring States Details, Jagan,-TeluguStop.com

కానీ ఇదే చర్చ ఏపీ సరిహద్దు రాష్ర్ట్రాల్లో కూడా నడవడం చర్చనీయాంశం.మరి జగన్ సర్కారు గెలుస్తుందని కొంత మంది అంటుంటే మాత్రం అది కొంత కష్టమని ఇంకొంత మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జగన్ సర్కారు కొన్ని విషయాల్లో తమ నిర్ణయాలను మార్చుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.అసలు జగన్ సర్కారు ఏ విషయంలో తన నిర్ణయాలను మార్చుకోవాలని వారు సూచిస్తున్నారంటే…

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది.

ఈ మూడేళ్ల కాలంలో వైసీపీ సర్కారు అనేక పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టింది.వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు దేశవ్యాప్తంగా కూడా ఆదరణను పొందాయి.

మరికొన్ని పథకాలను సొంత రాష్ర్ట్ర ప్రజలే ఆదరించలేదు.ఇలా వైసీపీ సర్కారు మూడేళ్ల నుంచి అనేక రకాల పథకాలను రాష్ట్ర ప్రజల కోసం తీసుకువస్తోంది.

వీటిలో కొన్ని పథకాలు హిట్ అవ్వగా, మరికొన్ని పథకాలు మాత్రం ప్రజాదరణకు నోచుకోక ఢీలా పడ్డాయి.

కానీ ఏపీలోని ప్రతి పక్షాలు మాత్రం రోజుకో గొడవ చేస్తూ జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేస్తునే ఉన్నాయి.ఇలా జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం వల్ వచ్చే నష్టం ఏమీ లేదని అనేక మంది చర్చించుకుంటున్నారు.2019 ఎన్నికలకు ముందు కూడా ప్రతి పక్షాలు ఇలాగే చేశాయని కానీ జగన్ చరిష్మాతో ఆ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించారని అంటున్నారు.అలాగే 2024 ఎన్నికల్లో కూడా గెలుపు వైసీపీనే వరిస్తుందని అంటున్నారు. ఈ చ‌ర్చ ఇంకెక్క‌డికి దారి తీస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube