మామూలుగా నేను ఫలానా వ్యక్తిని చంపుతానని దగ్గరివాళ్ళకి కూడా ఎవ్వరు చెప్పరు.అలాంటిది పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు ఎవరో మహానుభావుడు.
మరి చంపేస్తానన్నది ఎవరైనా మామూలు వ్యక్తినా అంటే కాదు … సాక్షాత్తు సల్మాన్ ఖాన్ ని చంపుతానని బెదిరించాడు.
పోలిసులకి ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని చెప్పడం ఏమిటి … వాడు కడుపు అన్నం తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా! అదేమి పైత్యం .ఎక్కడి నుంచి వచ్చిన గుండెధైర్యం.వరుసగా రెండురోజులు ముంబై పోలీసులకి ఫోన్ చేసి చెప్పిన మాటే మళ్ళీ చెప్పాడు… సల్మాన్ ఖాన్ ని చంపేస్తానని.
కాల్ ని ట్రేస్ చేసి ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోగలిగారు కాని ఎవరు చేసారన్నది ఇంకా తెలియలేదు పోలిసులకి.నిజంగానే ఎవరైనా సల్మాన్ మీద హత్యాయత్నం చేస్తున్నారా లేక ఇది కేవలం ఒక అకతాయి పనా? పోలిసులకే తెలియట్లేదు .మనకేం తెలుసు.