'శ్రియ' తొలి చిత్ర హీరో ఎలా చనిపోయాడో తెలుసా?

2001 లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై విడుదలన సినిమా ఇష్టం.కాగా ఈ సినిమాలో నటించిన హీరోకు, హీరోయిన్ కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

 Death Secret Of Istam Hero, Shreya Saran, Hero Charan Reddy, Supriya Jonnalagadd-TeluguStop.com

కాగా అప్పట్లో అగ్ర కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియ సరన్ ఇందులో కథానాయికగా నటించారు.ఈ ఇష్టం మూవీలో హీరోగా చరణ్ రెడ్డి నటించారు.

కాని మొదటి సినిమానే చివరి సినిమా అవుతుందని ఎవరూ అనుకోని ఉండరేమో.

అనుకోని విధంగా చరణ్ కు 2012 లో గుండెపోటు వచ్చి మరణించండం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

కాని అసలు ఆయన నిజంగా గుండెపోటుతోనే చనిపోయాడా లేక ఆయన మరణం వెనుక ఇంకేమైనా కారణం ఉందా అనేది అందరినీ వేధించే ప్రశ్నగా మిగిలింది.అసలు ఆయన మరణం వెనుకున్న కారణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

చరణ్ రెడ్డి ‘ఇష్టం’ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు.కాని ఈ సినిమా ఆయనకు ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేకపోయింది.

దాంతో ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గాయనే చెప్పుకోవచ్చు.ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

కాని ఆ తర్వాత నుంచి ఆయనకు సంబంధించిన ఏ విషయాలు బయటకు రాలేదనే చెప్పుకోవచ్చు.కాగా చరణ్ కు అనుకోకుండా గుండెనొప్పి రావడంతో అతన్ని హైదరాబాద్ లోని అపోలో ఆస్పిటల్ లో జాయిన్ చేశారు.

కాని అప్పటికే చరణ్ మరణించాడని డాక్టర్లు చెప్పారు.కాని అప్పటికే చరణ్ ,సుప్రియ లు విడాకులు తీసుకోవడానికి కోర్టును కూడా ఆశ్రయించారని వార్తలు కూడా వచ్చాయి.కాగా అంతలోనే ఇలా జరగడం బాధాకరం.అయితే చరణ్ పోస్టుమార్టంలో డాక్టర్లు కొన్ని సంచలన విషయాలను వెళ్లడించారు.

ఆయన మానసిక ఒత్తిడికి గురికావడం మూలంగా మధ్యానికి బానిసయ్యారని దాంతో ఆయన అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు తెలిపారు.అలాగే ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ పూర్తిగా పట్టించుకోకపోవడం మూలంగానే ఆయన మధ్యానికి బానిసై లివర్ డామేజ్ అయ్యి చరణ్ చనిపోయాడని డాక్టర్లు వెళ్లడించారు.

ఈ విషయం అందరినీ కంటతడి పెట్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube