అక్కడ మైనర్లకి మరణ శిక్ష ఎత్తివేసిన ప్రభుత్వం... 

ప్రపంచంలోకెల్లా అతి సంపన్నమైన దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి.అందువల్లే ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి ఈ దేశానికి డబ్బులు సంపాదించడానికి వలస వెళుతుంటారు.

 Death Punishment Cancelled To The Miners In Saudi Arabia-TeluguStop.com

అయితే ఈ దేశంలో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల ఈ దేశంలో క్రైమ్ రేట్ దాదాపుగా చాలా తక్కువగానే ఉంటుంది.

అంతేగాక ఈ దేశంలో తప్పు చేసిన వారికి ఎక్కువగా మరణ శిక్ష విధిస్తూ ఉంటారు.  కాగా కొన్ని దేశాల్లో 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మరణ శిక్ష విధిస్తుంటారు.

 Death Punishment Cancelled To The Miners In Saudi Arabia-అక్కడ మైనర్లకి మరణ శిక్ష ఎత్తివేసిన ప్రభుత్వం… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ సౌదీ అరేబియాలో మాత్రం చిన్న, పెద్ద ఎవరైనాసరే నేరం నిరూపణ అయితే మరణ శిక్ష తప్పదు.

అయితే తాజాగా ఈ దేశ ప్రభుత్వం 18 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మైనర్లకు విధించేటువంటి మరణశిక్ష విషయములో కొంత వెసులుబాటు తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా నేరానికి తగ్గట్టుగా విధించేటువంటి మరణశిక్షను ఎత్తివేస్తూ మరణ శిక్ష స్థానంలో ఇంకొంతకాలం జైలు శిక్ష పొడిగించడం, లేదా సమాజ సేవలు చేయడం వంటి వాటిని అమలులోకి తెచ్చేందుకు ఆ దేశ రాజు సల్మాన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో కొందరు మైనర్ బాలులు తొందర్లోనే చెరసాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ మరణ శిక్ష సడలింపులు కేవలం మైనర్ల విషయంలో మాత్రమేనని మరియు ఇతరుల నేరాల విషయంలో మాత్రం యధావిధిగా శిక్షలు కొనసాగుతుంటాయని తెలిపారు.అలాగే 10 సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన వారి ఈ విషయంలో కూడా మరో కీలక నిర్ణయాన్ని తొందర్లోనే తీసుకోబోతున్నట్లు సమాచారం.

#Saudi Arabia #SaudiArabia

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు