భారత్ బంద్ వల్ల ధరలైతే పెద్దగా తగ్గలేదు...కానీ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.! ఇదెక్కడి న్యాయం.?  

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ భగ్గుమంటూ శుక్రవారం ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించాయి. ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు 10 వ తేదీన భారత్ బంద్ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ బంద్ లో అపశృతి చోటుచేసుకుంది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న ఓ బాలిక ట్రాఫిక్‌లో చిక్కుకుని రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బీహార్‌లోని జహనాబాద్‌లో చోటు చేసుకుంది.

Death Of 2-year-old Girl Due To Bharat Bandh-

Death Of 2-year-old Girl Due To Bharat Bandh

వివరాలలోకి వెళ్తే.. నిరసనకారులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించడంతో… జహనాబాద్ ప్రభుత్వాసుపత్రికి బాలికను తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డుపైనే ఇరుక్కుపోయింది. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

Death Of 2-year-old Girl Due To Bharat Bandh-

ఆ చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ…”వాళ్లు అంబులెన్స్‌ను ముందుకు వెళ్లనిచ్చే ఉంటే మా పాపను ప్రాణాలతో కాపాడుకునేందుకు అవకాశం ఉండేది అన్నారు. ” ఇది ఇలా ఉండగా..ఇంధన ధరలపై విపక్షాలు బీహార్‌‌లో చేపట్టిన భారత్ బంద్‌తో రైలు, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, వామపక్షాలు, హిందూస్థానీ అవామ్ మోర్చా భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.