ట్రైలర్‌ టాక్‌ : డియర్‌ కామ్రెడ్‌ మరో అర్జున్‌ రెడ్డిలా రచ్చ చేసేలా ఉన్నాడు  

Dear Comrade Trailer Talk-

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న డియర్‌ కామ్రేడ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నెలలో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు...

Dear Comrade Trailer Talk--Dear Comrade Trailer Talk-

దాంతో సినిమా ఈ నెల చివర్లో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.ట్రైలర్‌ విడుదల నేపథ్యంలో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.సినిమా ట్రైలర్‌ రచ్చగా ఉందనే టాక్‌ అప్పుడే మొదలైంది.

Dear Comrade Trailer Talk--Dear Comrade Trailer Talk-

ట్రైలర్‌పై విజయ్‌ దేవరకొండ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని భరత్‌ కమ్మ తెరకెక్కిస్తున్నాడు.అన్ని కార్యక్రమాలు చకచక పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలతో సినిమా రిలీజ్‌కు అంతా రెడీ అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే విజయ్‌ దేవరకొండ లుక్‌ గత చిత్రాల మాదిరిగానే ఉంది.

అయితే యాటిట్యూడ్‌ను చూస్తుంటే మాత్రం అర్జున్‌ రెడ్డి సినిమాలో ఉన్న మాదిరిగా ఉండటంతో ఆసక్తి రేకెత్తుతోంది..

కాలేజ్‌ స్టూడెంట్‌ లీడర్‌ అయిన విజయ్‌ దేవరకొండ రాష్ట్ర స్థాయి క్రికెటర్‌ అయిన రష్మిక మందన్నతో ప్రేమలో పడతాడు.ఆమెను వదిలేసి మూడు సంవత్సరాలు దూరంగా ఉండి, ఆమె పెళ్లి చేసుకునే సమయంకు వస్తాడు అని ఈ ట్రైలర్‌లో చూపించారు.సినిమాపై ఆసక్తి పెరగడంతో పాటు, కథ విషయంలో సస్పెన్స్‌ ఉంచి ట్రైలర్‌ను కట్‌ చేశారు.

దాంతో సినిమా కథ ఏంటా అంటూ ప్రేక్షకులు బుర్రలు బద్దలు కొట్టుకునే పరిస్థితి.మొత్తానికి డియర్‌ కామ్రేడ్‌ మరోసారి అర్జున్‌ రెడ్డి తరహాలో రచ్చ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది...