కామ్రేడ్‌ బాలీవుడ్‌ మూవీకి ఏర్పాట్లు షురూ  

Dear Comrade Movie Go To Bollywood Sets - Telugu Dear Comrade, , Karan Johar, Rashmikha Mandhana, Tollywood Flop Movie, Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు.అందుకే ఆయనతో సినిమా చేయాలని కరణ్‌ జోహార్‌ గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Dear Comrade Movie Go To Bollywood Sets

ఆమద్య గీత గోవిందం సమయంలో కరణ్‌ జోహార్‌తో విజయ్‌ దేవరకొండ భేటీ అవ్వడం, ముంబయిలో సినిమాల గురించి తెగ మాట్లాడుకోవడం చేశారు.ఆ సమయంలోనే విజయ్‌ దేవరకొండతో తాను సినిమాను చేస్తానంటూ కరణ్‌ స్వయంగా ప్రకటించాడు.

అది ఇప్పుడు సెట్స్‌ పైకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం కరణ్‌ జోహార్‌తో పాటు మరి కొందరు బాలీవుడ్‌ మేకర్స్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు.

కామ్రేడ్‌ బాలీవుడ్‌ మూవీకి ఏర్పాట్లు షురూ-Movie-Telugu Tollywood Photo Image

అందుకు సంబంధించిన కథ చర్చలు కూడా చివరి దశకు వచ్చాయి.ఈనెల 6వ తారీకున విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ మూవీ గురించి కరణ్‌ నుండి అఫిషియల్‌ ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

విజయ్‌ దేవరకొండ భారీ అంచనాల నడుమ నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.దాంతో కాస్త విజయ్‌ ఢీలా పడ్డాడు.

ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ తర్వాత చేస్తాడనుకున్న హీరో చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాడు.

ఇదే సమయంలో బాలీవుడ్‌ మూవీ కూడా చేయబోతున్నాడు.బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో అన్ని భాషల్లో కూడా ఈ చిత్రంను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండపై మొదటి నుండి కూడా కరణ్‌ జోహార్‌కు చాలా నమ్మకం ఉంది.మరి రౌడీని కరణ్‌ ఏం చేస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dear Comrade Movie Go To Bollywood Sets-,karan Johar,rashmikha Mandhana,tollywood Flop Movie,vijay Devarakonda Related....