నాగబాబు గారు ఏంటీ ఈ చిల్లర కామెంట్స్‌... మీ స్థాయి మరుస్తున్నారా?

కొన్ని రోజుల క్రితం బాలకృష్ణపై వరుసగా కామెంట్స్‌ చేసిన నాగబాబును కొందరు అభినందిస్తే, మరి కొందరు విమర్శించారు.ఎప్పుడో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కామెంట్స్‌, కౌంటర్‌ ఏంటని కొందరు ప్రశ్నించారు.

 Dear Nagababu What Is This Nonsense Talking-TeluguStop.com

మరి కొందరు మాత్రం మెగా కౌంటర్‌ బాగుందని అభినందించారు.బాలకృష్ణపై తాను చేసిన వ్యాఖ్యలకు సోషల్‌ మీడియాలో బాగా స్పందన వచ్చిందని భావించాడో లేక మరేంటో కాని నాగబాబు వరుసగా రాజకీయాలకు సంబంధించిన సెటైర్లు వేస్తానంటూ ప్రకటించాడు.

అందుకోసం మై ఛానెల్‌ నా ఇష్టం అంటూ యూట్యూబ్‌లో సందడి చేస్తున్నాడు.

బాలకృష్ణపై వ్యాఖ్యల తర్వాత మొదటగా లోకేష్‌పై వీడియోను చేశాడు.ఆ తర్వాత జగన్‌పై వీడియోను వదిలాడు.ఆ తర్వాత మళ్లీ లోకేష్‌ను టార్గెట్‌ చేశాడు.

నాగబాబు వరుస వీడియోలు చూస్తుంటే ఇది టీడీపీ, వైకాపాలను టార్గెట్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఇలా అయితే ఆ పార్టీలో ఉన్న మెగా ఫ్యాన్స్‌ ఎక్కువ శాతం హర్ట్‌ అయ్యే అవకాశం ఉందని, దాంతో పాటు, చిల్లర కామెంట్స్‌కు కొందరు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు ఇలా పొలిటికల్‌ విషయాలపై చిల్లర కామెంట్స్‌ చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం లేక పోగా నష్టాలే ఎక్కువ అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.మెగా బ్రదర్‌ను కొందరి వారిగా పరిగణించాల్సి ఉంటుంది.అలాంటప్పుడు నాగబాబు సినిమాల్లో మరియు ఇతర కార్యక్రమాల్లో భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉంది.నాగబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే జనసేన పార్టీ తరపున నాగబాబుకు అసలు పవన్‌ సీటు ఇచ్చేనా అనేది కొందరి అనుమానం.మొత్తానికి నాగబాబు తన మెగా స్థాయిని మర్చి కామెడీ వ్యాఖ్యలు చేస్తూ అల్లరిపాలవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube