మేఘా ఆకాష్ మూడో తెలుగు సినిమా ఒటీటీ రిలీజ్

సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల మేఘా ఆకాష్. ఈ భామ తెలుగులో నితిన్ కి జోడీగా లై సినిమాతో తెరంగేట్రం చేసింది.

 Dear Megha Movie Going To Release In Ott-TeluguStop.com

అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.తరువాత నితిన్ తోనే చల్ మోహన రంగా అనే మూవీలో ఆడిపాడింది.

ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.దీంతో తెలుగు దర్శకులు ఎవరూ కూడా మేఘా వైపు చూడలేదు.

 Dear Megha Movie Going To Release In Ott-మేఘా ఆకాష్ మూడో తెలుగు సినిమా ఒటీటీ రిలీజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ లు అందుకొని వరుసగా సినిమాలు చేస్తుంది.పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినా కోలీవుడ్ లో అయితే మేఘా ఆకాష్ కి భాగానే అవకాశాలు అస్తున్నాయి.

తెలుగులో కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో డియర్ మేఘా అనే సినిమాలో తాజాగా నటించింది.

Telugu Aditi Arun, Dear Megha Movie, Director Sushanth Reddy, Megha Akash, Ott, Tollywood-Movie

ఫిమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంతో సుశాంత్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.అరుణ్ దాస్యన్ ఈ మూవీని నిర్మించారు.ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ కి జోడీగా యంగ్ హీరో అదితి అరుణ్ నటించాడు.ఇదిలా ఉంటే తెలుగు, తమిళ్ బాషలలో ఈ మూవీని ఒకే సారి రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ప్రస్తుతం చిన్న సినిమాలకి ఒటీటీ ఛానల్స్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి.థియేటర్లు ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయలేక చాలా మంది డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు.

ఒటీటీ ఛానల్స్ ఇచ్చే ఆఫర్స్ కూడా గిట్టుబాటుగా ఉండటంతో నిర్మాతలు కూడా థియేటర్ రిలీజ్ అని కూర్చోకుండా ఒటీటీ వైపే మొగ్గు చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పుడు డియర్ మేఘా కూడా ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ విషయాన్ని నిర్మాత అరుణ్ దాస్యన్ తాజాగా ప్రకటించాడు.ఓ ప్రముఖ ఒటీటీ ఛానల్ లో డియర్ మేఘ రిలీజ్ కాబోతుందని స్పష్టం చేశారు.

#Megha Akash #Aditi Arun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు