'డియర్‌ కామ్రేడ్‌' సెన్సార్‌ రివ్యూ  

Dear Comrade Movie Censor Review-

విజయ్‌ దేవరకొండ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.మైత్రి మూవీస్‌ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ చిత్రం ప్రమోషన్‌ ఏ స్థాయిలో చేస్తున్నారో మనం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం...

Dear Comrade Movie Censor Review--Dear Comrade Movie Censor Review-

ఎప్పుడు లేని విధంగా మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తూ విజయ్‌ దేవరకొండ మరియు రష్మికలు రచ్చ చేస్తున్నారు.

గీత గోవిందం చిత్రంతో ఈ జంటకు విపరీతమైన యూత్‌ క్రేజ్‌ దక్కింది.అలాంటి వీరిద్దరు మళ్లీ కలిసి నటించడంతో అంచనాలు పెరిగాయి.

Dear Comrade Movie Censor Review--Dear Comrade Movie Censor Review-

ఇక సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌ చూసిన తర్వాత గీత గోవిందంను క్రాస్‌ చేసేలా ఈ చిత్రం ఉంటుందనిపిస్తుంది.అందుకే డియర్‌ కామ్రేడ్‌ చిత్రం కోసం గతకొన్ని నెలలుగా యూత్‌ ఆడియన్స్‌ విపరీతమైన క్రేజ్‌తో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది.

ఇక ఈ సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు చాలా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది.సినిమాలో విజయ్‌ దేవరకొండ ఎనర్జి చాలా బాగుందని, తప్పకుండా ఇది ఆయన గత చిత్రాల స్థాయిని మించి ఉంటుందనే కామెంట్‌ చేశారట.

తప్పకుండా ఇది విజయ్‌ కెరీర్‌లోనే కాకుండా రష్మిక కెరీర్‌లో కూడా బెస్ట్‌ నటన పరంగా నిలిచి పోతుందని అంటున్నారు.ఈ సినిమాకు కలెక్షన్స్‌ మాత్రమే కాకుండా అవార్డులు కూడా వస్తాయనే నమ్మకంను సెన్సార్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మరెన్ని సంచలనాలకు తెర లేపుతుందో చూడాలి.