డియర్‌ కామ్రేడ్‌' బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలిస్తే  

Dear Comrade Movie Budget-dear Comrade,movie Budget,tollywood Updates,vijay Devarakonda,yash Rangineni

యూత్‌ సెన్షేషన్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. పెద్ద ఎత్తున ఈ చిత్రం కోసం విజయ్‌ కష్టపడుతున్నాడు. వరుసగా షూటింగ్స్‌లో పాల్గొన్న కారణంగానే తాజాగా విజయ్‌ దేవరకొండ అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు డియర్‌ కామ్రేడ్‌ బిజినెస్‌ గురించి సినీ వర్గాల్లో కుప్పలు తెప్పలుగా చర్చ జరుగుతోంది..

డియర్‌ కామ్రేడ్‌' బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలిస్తే-Dear Comrade Movie Budget

పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకు విడుదలకు ముందే రెట్టింపు లాభం వచ్చేలా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రంకు భారీ డిమాండ్‌ ఉందని సమాచారం అందుతోంది.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రం నైజాం ఏరియాలో ఏషియన్‌ మూవీస్‌ వారు 7.5 కోట్లకు కొనుగోలు చేశారట. ఇక ఏపీలో ఈ చిత్రం దాదాపు 7 కోట్ల వరకు బిజినెస్‌ చేస్తుందని, సీడెడ్‌లో అయిదు కోట్ల వరకు రాబట్టడం ఖాయం అంటున్నారు. ఇక శాటిలైట్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ద్వారా సునాయాసంగా 10 నుండి 12 కోట్ల వరకు రాబట్టడం జరుగుతుంది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం మూడున్నర నుండి అయిదు కోట్ల వరకు బిజినెస్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమాకు రోజు రోజుకు క్రేజ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెంబర్స్‌ మరింతగా పెరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

20 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంకు భరత్‌ కమ్మ దర్శకత్వం వహించాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ చిత్రం కన్నడం, తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.

తమిళ రైట్స్‌ ద్వారా మూడు కోట్లు, మలయాళ రైట్స్‌ ద్వారా కోటి రూపాయలు, కన్నడ రైట్స్‌ ద్వారా నాలుగు కోట్ల వరకు నిర్మాతలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం దాదాపుగా 50 కోట్లకు పైగానే బిజినెస్‌ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విజయ్‌ దేవరకొండ క్రేజ్‌కు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు. దానికి తోడు ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించడం కూడా, అదే విధంగా ముద్దు సీన్స్‌ ఈ చిత్రంలో ఉన్న కారణంగా బయ్యర్లు ఎగబడి కొంటున్నారు..

మే చివర్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.