ఏపీలో డ్రీమ్ 11పై బ్యాన్.. మరి వ్యాలెట్ లో డబ్బులు ఉన్నవారి సంగతి…?!  

AP Bans Dream 11, Andhra Pradesh Government, Dream11, IPL2020, Dream11 Wallet - Telugu Andhra Pradesh Government, Andhrapradesh, Ap Bans Dream 11, Banned, Dream11, Dream11 Wallet, Ipl2020, Jagan Mohan Reddy

ప్రస్తుతం భారతదేశం అంతా ఐపీఎల్ సందడి నెలకొని ఉంది.కేవలం భారతదేశంలోనే కాకుండా క్రికెట్ ఆడే ప్రతి దేశంలో కూడా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది.

TeluguStop.com - Deam 11 Banned In Andhrapradesh 11

అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్రికెట్ లవర్స్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11 పై జగన్ సర్కార్ నిషేధాన్ని విధించింది.

కొత్తగా రాష్ట్ర గేమింగ్ చట్టాలలో చేసిన మార్పుల కారణంగా రాష్ట్రంలో డ్రీమ్ 11 యూజర్లు పైడ్ కాంటెస్ట్ లో చేరలేకపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా నాగాలాండ్ సిక్కిం, ఒరిస్సా, అస్సాం, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా డబ్బులు చెల్లించి ఆడటంపై కాస్త గందరగోళం నెలకొంది.

TeluguStop.com - ఏపీలో డ్రీమ్ 11పై బ్యాన్.. మరి వ్యాలెట్ లో డబ్బులు ఉన్నవారి సంగతి…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆంధ్రప్రదేశ్ తో సహా ఈ రాష్ట్రాలలో కూడా ఆన్లైన్ గేమ్స్ లో పే బాలన్స్ కు సంబంధించి ఎలాంటి యాప్స్ ను అనుమతించలేదు.డ్రీమ్ 11 యాప్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ పై ఓ సందేశాన్ని చూపిస్తుందని డ్రీం లెవెన్ పేర్కొంది.

కాకపోతే, డ్రీమ్ 11 లో ఉచితంగా కూడా ఫాంటసీ క్రికెట్ ని ఆస్వాదించవచ్చు.అయితే, రాష్ట్రంలో కేవలం డబ్బులు చెల్లించి ఆడే వారికి మాత్రమే నిషేధం విధించారని.

ఇలా డ్రీం లెవెన్ ఆకస్మికంగా నిషేధించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా మంది వారి డ్రీమ్ 11 వ్యాలెట్ లో వేలకు వేలు ఉన్నాయి.

ఇక వారి పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారిపోయింది.ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక మంది నెటిజెన్స్ వారి గోడును వెల్లబోసుకున్నారు.వాళ్ళు ఒకవైపు బాధపడుతుంటే మరికొంతమంది బాగా అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఉన్నఫలంగా ఇలా చేయడం ద్వారా డ్రీమ్ 11 ఆడే వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా డ్రీమ్ 11 లో వారి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటూ ట్వీట్ పూర్వకంగా ప్రశ్నిస్తున్నారు.అయితే ఇందుకు సంబంధించి డ్రీం లెవెన్ తాజాగా స్పందించింది.

మీ డ్రీమ్ 11 వ్యాలెట్ లో ఉన్న డబ్బులు అన్నీ ఉంటాయి.ఎక్కడికి పోవని తెలిపింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కోసం https://d11.co.in/HelpCenter లో కాంటాక్ట్ అవ్వండి అంటూ తెలియజేసింది.

మీకు ఏదైనా ఫిర్యాదు ఉంటే అక్కడ తెలపండి, మీకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని తెలియజేసింది.అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ డబ్బులు పెట్టి ఆడుతున్న యాప్స్ పై ఉక్కుపాదం మోపుతోంది.

కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా వృధాగా ఖర్చు చేస్తున్నారన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

#Dream11 #Banned #Andhrapradesh #Dream11 Wallet #IPL2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Deam 11 Banned In Andhrapradesh 11 Related Telugu News,Photos/Pics,Images..