గరుడ పురాణం ప్రకారం చేసిన పాపాలకు నరకంలో శిక్షలు ఇవే  

Deadly Punishments In Garuda Puaran-

English Summary:Eighteen Puranas knew about the legend of one of the Garuda. But we are completely unaware of the terms of the Garuda Purana.

1. palincakapote them properly until they beat dental extraction.In a way, the road roller to crush the mix.
2.Yam docukonevariki blood money to the police to beat up the ropes. Padipoyevaraku do they have to beat.
3. For those who do not respect the elderly are placed in extreme heat.The heat is unbearable.
4.Those who do not help others tosestaru large valleys. There are also toxic to animal cruelty.
5. Those who abuse the power of the human urinary river padestaru pariah.

అష్టాద‌శ పురాణాల్లో ఒకటైన గ‌రుడ పురాణం గురించి తెలుసు. కానీ గరుడ పురాణంలో ఉన్న శిక్షలు గురించి మనకు పూర్తిగా తెలియదు. ఈ గరుడ పురాణం గురించి శ్రీ మహా విష్ణువు తన వాహనం అయిన గరుడ పక్షికి చెప్పటంతో ఈ పురాణంనకు గరుడ పురాణం అని పేరు వచ్చింది...

గరుడ పురాణం ప్రకారం చేసిన పాపాలకు నరకంలో శిక్షలు ఇవే -

ఈ పురాణంలో ఏ పాపం చేస్తే నరకంలో ఏ శిక్షలు పడతాయో వివరంగా ఉంది. 1. ప్రజలను సరిగ్గా పాలించకపోతే వారిని పిప్పి పిప్పి అయ్యేవరకు కొడతారు. ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు.

2. ప్రజల ధనాన్ని దోచుకొనేవారికి యమ భటులు రక్తం వచ్చేలా తాళ్ళతో కొడతారు. వారు పడిపోయేవరకు అలా కొడుతూనే ఉంటారు.

3. పెద్దవారికి గౌరవం ఇవ్వని వారికి విపరీతమైన వేడిలో ఉంచుతారు.

ఆ వేడి భరించలేనిదిగా ఉంటుంది.

4. ఇతరులకు సహాయం చేయని వారిని పెద్ద పెద్ద లోయలలోకి తోసేస్తారు. అలాగే అక్కడ వారిని విష జంతువులతో హింసిస్తారు...

5. అధికారం దుర్వినియోగం చేసే వారిని మానవ మాల మూత్రలు ఉన్న నదిలో పాడేస్తారు. వాటిని త్రాగుతూ శిక్షను అనుభవించాలి.

6. అబద్దాలు ఆడుతూ ఇతరులను మోసం చేసే వారిని తల క్రిందులుగా వ్రేలాడ తీసి క్రూర జంతువులతో హింసిస్తారు.


7. జంతువులను హింసించే వారిని నరకంలో సల సల కాగే మరిగే నూనెలో ఫ్రై చేస్తారు.

8.పేదలకు అన్నం పెట్టకుండా ఉండే వారిని నరకంలో పక్షులకు ఆహారంగా వేస్తారు .

9.మధ్యం సేవించే వారికి నరకంలో కరిగించిన ఇనుమును త్రాగిస్తారు.

10.జంతువులను చంపే వారిని నరకంలో జంతువులను కోసినట్టే వారిని కూడా ముక్కలు ముక్కలుగా కోస్తారు.