ఆ "ఫుట్‌పాత్" పై నడిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా..?

మామూలుగా రోడ్లపక్కన మనం ఫుట్ పాత్ గమనిస్తూనే ఉంటాం.రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డంగా నడవకుండా ప్రభుత్వాలు రోడ్లకు ఇరుపక్కల ప్రజలు నడవడానికి ఫుట్‌పాత్ ఏర్పాటు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Deadly Essex Path  More Than 100 People, England, Broom Way Path, England,essex-TeluguStop.com

అయితే ఓ ఫుట్‌పాత్ ను కిల్లర్ ఫుట్‌పాత్ అని పిలుస్తున్నారు.ఇందుకు కారణం లేకపోలేదు.

ఇంతవరకు ఆ ఫుట్‌పాత్ పై నడిచిన వారి ప్రాణాలు పోయాయి. ప్రపంచంలోనే అత్యంత డేంజర్ ఫుట్‌పాత్ గా ఆ స్థలం పేరు పొందింది.

ఆ ఫుట్‌పాత్ పై వెళితే మనిషి కనిపించకుండా పోవడం లేకపోతే పక్కనే ఉన్న నీటిలో శవమై తేలడం జరుగుతుందట.అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇంగ్లాండ్ లోని ఎసెక్స్ నుంచి ఫౌల్ ‌నెస్ ఐలాండ్ వరకు గల సముద్రతీరంలో 600 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఆ ఫుట్‌పాత్ పై నడుస్తుంటే పూర్తిగా సముద్రంలోకి వెళుతునట్టే అనిపిస్తుంది.600 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ ఫుట్‌పాత్ పై నడవటానికి ఇష్టపడతారు.పర్యాటకులు ఇష్టపడినా కానీ ఆ ఫుట్‌పాత్ పై నడవడం అంత సులువైన పని మాత్రం కాదు.దీనికి కారణం ఆ ఫుట్‌పాత్ సముద్రపు అలల తాకిడి వల్ల దాదాపు కనపడకుండా పోయిందనే చెప్పవచ్చు.

ఆ ఫుట్‌పాత్ సముద్రపు నీటి మట్టం వల్ల పూర్తిగా నీటిలోనే ఉంటుంది.ఇలా నీటిలో ఉండడం ద్వారా దానిపై నడవాలని ప్రయత్నించిన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.

ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 100 మంది ప్రాణాలు కోల్పోయారని రికార్డులు తెలుపుతున్నాయి.

Telugu Broom Path, Path, England, Essex Path, Foulness Island, Ocean-Latest News

ఈ ఫుట్‌పాత్ సముద్రం వెనక్కి వెళ్లిన సమయంలో స్పష్టంగా కనబడుతుంది.ఆ సమయంలో దానిపై నడవడం చాలా సులభం కాకపోతే తప్పుడు సమయాల్లో ఆ మార్గంపై నడుస్తున్న మాత్రం సముద్రపు అలల్లో చిక్కుకొని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ దేశ అధికారులు తెలుపుతున్నారు.దీనికి కారణం సముద్ర అలలు వెనక్కి వెళ్లే సమయంలో నీరు చాలా వేగంగా తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుంటుందని, అది ఎంతలా అంటే ఓ సాధారణ వ్యక్తి పరిగెత్తే వేగం కంటే స్పీడ్ గా ఆ కెరటాలు దూసుకువస్తాయని అక్కడి అధికారులు తెలుపుతున్నారు.

ఇలాగే ఎంతో మంది ఆ ఫుట్ పాత్ పై నడిచి ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు నీటిలో కొట్టుకుపోయి వారి జాడ కూడా తెలియలేదని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube