తిమింగలం పొట్టలో ఏకంగా 100 కేజీలు ప్లాస్టిక్! సోషల్ మీడియలో వైరల్

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతుంది.ఈ ప్లాస్టిక్ కారణంగా ఇప్పుడు వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Dead Sperm Whale Had 220 Pounds Of Garbage In Its Stomach-TeluguStop.com

ఇది వాతావరణంతో పాటు ఈ భూమిపై బ్రతుకుతున్న అన్ని రకాల జీవరాశులని కూడా నాశనం చేస్తున్నాయి.ఇక సముద్రాలలో ప్లాస్టిక్ కి విపరీతంగా కలిపేస్తున్నారు.

దీంతో సముద్రాలలో బ్రతికే జీవరాశులు వీటి కారణంగా తమ ఉనికిని కోల్పోతున్నాయి.కొన్ని వందల సంవత్సరాలు పాటు జీర్ణం కాకుండా ఉండిపోయే ఈ ప్లాస్టిక్ ని సముద్ర జీవులు తినేసి అకారణంగా చనిపోతున్నాయి.

పర్యావరణ వేత్తలు ప్లాస్టిక్ గురించి హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు దీనిని తగ్గించే పనిలో పడ్డాయి.
ఇక ప్లాస్టిక్ సముద్ర జీవులని ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నాయో తాజాగా ఓ సంఘటన బయటపెట్టింది.

స్కాట్లాండ్‌ బీచ్‌లో ఒక భారీ తిమింగలం ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేయడం వల్ల చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.నవంబర్ 28వ తేదీన స్కాట్లాండ్‌లోని లస్కెంటైర్ బీచ్‌ ఒడ్డుకు తిమింగలం కళేబరం కొట్టుకురావడంతో నిపుణుల బృందం శవ పరీక్ష నిర్వహించింది.

ఆ సమయంలో తిమింగలం పొట్టలోంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి వారు షాకయ్యారు.తిమింగలం మింగిన వాటిలో చేపల కోసం వేసే వలలు, తాళ్ల కట్టలు, ట్యూబ్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.13 అడుగుల పొడవైన ఈ తిమింగలం భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను మింగేయడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం కావడంతో చనిపోయినట్లు నిపుణుల బృందం తెలిపింది.దీనికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube