పిల్లర్ నెంబర్ 222 వద్ద శవం.. అసలేం జరిగిందంటే?  

Dead Body Found in Suit Case, Hyderabad, Minors Killed Man, Rajendra Nagar, Thieves, Dead Body in Suitcase - Telugu Crime, Dead Body, Dead Body Found In Suit Case, Dead Body In Suitcase, Hyderabad, Minors Killed Man, Rajendra Nagar, Suitcase, Thieves

సమాజంలో రోజురోజుకూ ప్రతి ఒక్క విషయంలో నేరాలు చేసుకుంటూపోతున్నారు.ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియని వయసు వాళ్ళు కూడా నేరాలకు పాల్పడుతున్నారు.

TeluguStop.com - Dead Body Found In Suitcase Rajendra Nagar

ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఘోరం జరిగింది.తనతో కలిసి ఉన్న తన స్నేహితులే తనను హతమార్చారు.
హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ రియాజ్.అతని వయసు 26 ఏళ్ళు.అతడికి ఇద్దరు మైనర్ స్నేహితులు ఉన్నారు.వీరు ముగ్గురు కలిసి చెడు వ్యసనాలకు అలవాటు అయ్యారు.

ఇతరుల ఆటోలలో బ్యాటరీలను దొంగతనం చేస్తూ వాటిని అమ్మి ఆ డబ్బుతో ఖర్చులు చేసేవారు.ఇంతకుముందే రియాజ్ కు హత్య కేసులో నిందితుడిగా ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది.

TeluguStop.com - పిల్లర్ నెంబర్ 222 వద్ద శవం.. అసలేం జరిగిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కాగా ఈ ఇద్దరు మైనర్ల తో కలిసి మరో వ్యక్తి సోహెల్.రియాజ్ ఆటో లో బ్యాటరీ దొంగతనం చేశారు.దీంతో విషయం తెలుసుకున్న రియాజ్ వాళ్లను కొట్టి పోలీసులకు అప్పగించాడు.దీంతో ఆ నిందితుల్లో ముగ్గురు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లలిత అనే యువతి వాహనంలో బ్యాటరీ దొంగలించారు.

విషయం తెలుసుకున్న రియాజ్ లలితకు బ్యాటరీ డబ్బులు ఆ నిందితులతో అందిస్తానని తెలిపాడు.దీంతో మైనర్ ఇద్దరిలో ఒకరు దీనికి అంగీకరించలేదు.ఆ తర్వాత ఆ ముగ్గురు నిందితులు రియాజ్ ను మద్యం తాపించి అంతమొందించాలి అనుకున్నారు.

కాగా రియాజ్ ను పహాడీ షరీఫ్ షహీన్ నగర్ లో ఉండే మరో వ్యక్తి ఇర్ఫాన్(26) ఇంటికి తీసుకెళ్లారు.

కాగా ఇర్ఫాన్ చెల్లితో రియాజ్ ను ఎందుకు వేదిస్తున్నావ్ అంటూ వాదనలకు దిగగా.దీంట్లో ఇర్ఫాన్ తల్లి తయ్యబా కూడా చేయి కలిపింది.వెంటనే రియాజ్ ను కర్రలతో కొట్టి చంపారు.ఇంట్లో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి ఓ సూట్ కేసులో శవాన్ని దాచారు.

కాగా ఆ సూట్ కేస్ ను మైనర్లు ఆటోలో తీసుకొని రాజేంద్రనగర్ 222 పిల్లర్ వద్ద చెత్తకుప్పలో వేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని ఆ ఇద్దరు మైనర్ల ను అదుపులోకి తీసుకున్నారు.

మిగతా ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

#DeadBody #Thieves #Dead Body #DeadBody #Crime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు