హీరో నాగ్ పొలంలో కుళ్లి పోయి పడి ఉన్న మృతదేహం  

Dead Body Found In Akkineni Nagarjuna Farm Land-akkineni Nagarjuna,akkineni Nagarjuna Farm Land,bigg Boss Telugu,nagachaitanya,samantha

టాలీవుడ్ లో గ్రీకు వీరుడుగా పేరుపొందిన హీరో నాగార్జున.ఆరు పదుల వయసులో కూడా ఈ తరం యూత్ కు ఏమాత్రం తగ్గకుండా మైంటైన్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్-3 తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.

Dead Body Found In Akkineni Nagarjuna Farm Land-Akkineni Akkineni Land Bigg Boss Telugu Nagachaitanya Samantha

అయితే నాగార్జున పొలంలో ఒక కుళ్లిపోయిన మృతదేహం లభించడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది.షాద్ నగర్ మండలం లోని కేశంపేట్ పరిధిలోని పాపిరెడ్డి గూడలో హీరో నాగార్జున 40 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుచేశారు.

అయితే ఇటీవల ఆ వ్యవసాయ క్షేత్రంలో భార్య అమల తో కలిసి మరి చెట్లు కూడా నాటాడు.అయితే సేంద్రీయ పంటలు పండించాలని అన్న ఉద్దేశ్యం తో తన వ్యవసాయ క్షేత్రానికి నిపుణులను కూడా పంపారు.

Dead Body Found In Akkineni Nagarjuna Farm Land-Akkineni Akkineni Land Bigg Boss Telugu Nagachaitanya Samantha

అయితే ఈ క్రమంలోనే నాగార్జున పొలంలో పరీక్షల కోసం వెళ్లిన నిపుణులకు ఆ ప్రాంతంలోని ఒక గదిలో కుళ్ళి పోయి ఉన్న మృతదేహన్నీ గుర్తించారు.దీనితో వెంటనే సమాచారం పోలీసులకు అందించడం తో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ కుళ్లి న మృతదేహానికి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

అయితే అసలు నాగ్ పొలంవద్ద దొరికిన ఆ మృతదేహం ఎవరిది, అసలు ఎప్పుడు ఈ ఘటన జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్న దానిపై అధికారులు దృష్టిపెట్టారు.

  అయితే ఆ మృతదేహం దాదాపు కుళ్లిపోయే స్టేజ్ లో ఉండడం సంచలనంగా మారింది.సెప్టెంబర్ 19 అనగా ఈ రోజు ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి, ఈ ఘటన పై అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ ఘటన పై హీరో నాగార్జున ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి.

తాజా వార్తలు

Dead Body Found In Akkineni Nagarjuna Farm Land-akkineni Nagarjuna,akkineni Nagarjuna Farm Land,bigg Boss Telugu,nagachaitanya,samantha Related....