చనిపోయిన బిడ్డ తిరిగి లేచాడు... ఎక్కడంటే!

మీరు వింటున్నది నిజమే.అక్కడ చనిపోయిన పసి బిడ్డ మరలా లేచింది.

 Dead Baby Resurrected Where Died Kid, Viral Latest, News Viral, Social Media, Vi-TeluguStop.com

పూడ్చిపెట్టిన ఓ గంట తర్వాత బతికింది.ఈ వింత ఘటన జమ్ముకశ్మీర్‌లో జరగగా తాజాగా వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, రాంబన్ జిల్లా బనిహాల్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని వున్న బంకూట్ గ్రామానికి చెందిన బషారత్ అహ్మద్ గుజ్జర్ భార్య షమీమా బేగం సోమవారం ఉదయం ఉప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.కాగా ఆ శిశువు మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
తరువాత మరణించిన శిశువుని హోలాన్‌ గ్రామంలో పూడ్చిపెట్టారు.దాంతో ఆ గ్రామస్తులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సుమారు ఓ గంట తర్వాత పూడ్చిన ఆడ శిశువును గోతి నుంచి బయటకు తీయగా, ఓ విషయం గమనించారు.ఆ చిన్నారి బతికే ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.అయితే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ కుటుంబం, బంధువులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

బతికున్న శిశువు చనిపోయినట్లుగా చెప్పడంపై వివరణ అడిగారు.

అక్కడికి వచ్చిన బంధువులు, స్థానికులు హాస్పిటల్ తీరుపైన మండిపడ్డారు.

దీంతో బనిహాల్ బ్లాక్‌ వైద్య అధికారిణి డాక్టర్ రబియా ఖాన్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్‌ నర్సు, ఒక స్పీపర్‌ను అక్కడినుండి సస్పెండ్‌ చేశారు.

అయితే ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమి కాదు.గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.

నేటి ఆసుపత్రులు బాధ్యతలను మరిచి వ్యవహరిస్తున్నాయి.ప్రాణాలు పోసే డాక్టర్లు ప్రాణాలు తీసేస్తున్నారు.

అదంతా ఒకెత్తయితే, బతికి వున్న మనిషిని వీరు చనిపోయారని చెప్పడం నిజంగా దారుణం.ఇలాంటి హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవలసిందిగా మనం కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube