తెలుగు క్రికెట‌ర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న కోహ్లీ, డివిలియ‌ర్స్‌..

భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ప్రజలు క్రికెట్ అంటే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు.క్రికెట్ మ్యాచ్ కోసమై తమ పనులు పక్కనబెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు.

 De Villiers, Kohli Lifts Telugu Cricketer To The Skies, .., Kohli, De Villiers,-TeluguStop.com

రీ ప్లే మ్యాచెస్‌ను కూడా భారతీయులు ఇంట్రెస్టింగ్‌గా చూస్తుండటం మనం చూడొచ్చు.క్రికెట్ లవర్స్ ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ సత్తా చాటాడు.కాగా ఏపీలోని విశాఖపట్నంకు చెందిన తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రశంసించారు.దీంతో తెలుగు వాళ్లు ఆనందపడుతున్నారు.

ప్రజెంట్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంలో వికెట్ కీపర్‌గా ఉన్న భరత్ ప్లేయర్‌గానూ రాణిస్తున్నాడు.

తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంయమనంతో వ్యవహరించాడు భరత్.తన బ్యాటింగ్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 44 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ క్రమంలో భరత్ ఆటతీరును మ్యాక్స్ వెల్‌తో పాటు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కొనియాడారు.దాంతో క్రికెట్ అభిమానులు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Benglur, Bharat, De Villiers, Kohi, Kohli, Srikar Bharth, Teleu Cricketer

భరత్ టాప్ క్లాస్ బ్యాటర్ అని, భరత్ బ్యాటింగ్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, అవి క్రికెట్‌లో చాలా యూజ్ ఫుల్ అని కోహ్లీ చెప్పారు.ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో భరత్ టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కించుకుంటారని అన్నారు.భరత్ వికెట్ కీపర్‌గా అత్యద్భుతంగా రాణిస్తున్నాడని కోహ్లీ పేర్కొన్నారు.ఇకపోతే శ్రీకర్ భరత్‌ను ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందర రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు తీసుకుంది.ఇక అత‌ను మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని అంతా కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube